Ala Vaikunthapurramloo | అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్నే సాధించింది. దాదాపు తన పేరు మీద ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంది ఈ మూవీ. త్రివిక్రమ్ మాయకు తమన్ సంగీతానికి అల్లు అర్జున్ నటన, డాన్స్ ఈ సినిమాకు పెద్ద ఎస్పెట్స్గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 450 మిలియన్స్‌కు పైగా వ్యూస్ క్రాస్ చేసింది. అంతేకాదు స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా ప్రసారం చేస్తే అదిరిపోయే రీతిలో 29.4 టీఆర్పీ సాధించింది. ఈ సినిమా మలయాళంలో అంగు వైకుంఠపురతు పేరుతో అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను అక్కడి సూర్య టెలివిజన్‌లో ప్రసారం చేయగా ఏకంగా 11.17 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మలయాళ టెలివిజన్ చరిత్రలో ఇది రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ అని తెలుస్తుంది.
అక్కడ స్ట్రెయిట్ సినిమాలకు కూడా ఈ స్థాయిలో టిఆర్పీ రాదని.. కానీ మలయాళంలో మన హీరో అల్లు అర్జున్ సాధించాడని పొంగిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. తన సినిమాలు విడుదలయ్యేటప్పుడు మలయాళంపై కూడా ఫోకస్ చేస్తాడు అల్లు అర్జున్. దానికి నిదర్శనమే ఈ రేటింగ్స్ కూడా. తాజాగా తెలుగు జెమినీ టీవీలో దీపావళి సందర్భంగా మరోసారి ‘అల వైకుంఠపురుములో’ సినిమాను టెలికాస్ట్ చేయగా.. దిమ్మ దిరిగే రేటింగ్ వచ్చింది.
సెకండ్ టైమ్ ప్రసారం చేస్తే.. ఈ సినిమాను కేవలం 7.91 రేటింగ్ సాధించింది. రెండో ప్రసారానికే ఈ రేంజ్లో రేటింగ్ పడిపోవడం చూసి ‘అల వైకుంఠపురుములో’ టీమ్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా మొదటిసారి చాలా మంది టీవీల్లో ఈ సినిమాను చూసిన వాళ్లు అంతకు ముందు థియేటర్స్‌లో చూసి ఉంటారు. మరోవైపు దీపావళి పండగ రోజున ఎవరి హడావుడిలో వారు ఉంటారు కాబట్టి.. రేటింగ్ అంతగా రాలేదని ‘అల వైకుంఠపురములో’ టీమ్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pooja Hegde, Tollywood, Trivikram