అలవైకుంఠపురంలో డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎవరికో తెలుసా..

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం అలవైకుంఠపురంలో తెలిసిందే.

news18-telugu
Updated: December 8, 2019, 7:23 PM IST
అలవైకుంఠపురంలో డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎవరికో తెలుసా..
Instagram
  • Share this:
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం అలవైకుంఠపురంలో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి 11న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. అల్లు అర్జున్ గత సినిమా 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనుకున్నంతగా అలరించకపోవడంతో బన్ని కసితో ఉన్నాడు. ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో  ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు థమన్ అందించిన సాంగ్స్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా విపరీతంగా అలరిస్తున్నాయి. ఈ మూవీ టీజర్ ఇంకొద్ది గంటల్లో విడుదల కానుంది. కాగా అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సన్ నెట్ వర్క్ అలవైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందట. దీనికి సంబంధించి డీల్ కూడా పూర్తయిందని సమాచారం. అంతేకాదు శాటిలైట్ హక్కులు కూడా సన్ నెట్ వర్క్ సంబందించిన జెమిని టీవీ దక్కించుకుందని టాక్. అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రల్లో  టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.
 View this post on Instagram
 

‪Samajavaragamana ! Fastest Viewed & Liked Song. Thank you all for all the Love ❤️ #Samajavaragama #alavaikunthapuramuloo ‬


A post shared by Allu Arjun (@alluarjunonline) on


చీరలో అందాలు ఆరబోసిన జాన్వీ కపూర్..
Published by: Suresh Rachamalla
First published: December 8, 2019, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading