వంద కోట్ల క్లబ్బులో ‘అల వైకుంఠపురములో’.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న బన్ని..

అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో రేసు గుర్రంలా పరిగెడుతోంది. మొత్తంగా ఈ సినిమా 6 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరైంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 18, 2020, 8:09 PM IST
వంద కోట్ల క్లబ్బులో ‘అల వైకుంఠపురములో’.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న బన్ని..
రూ. 100 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘అల వైకుంఠపురములో’ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో రేసు గుర్రంలా పరిగెడుతోంది. ఫస్ట్ డే వాల్డ్ వైడ్‌గా ’అల వైకుంఠపురములో’  దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా సెకండ్ డే ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ.10.25 కోట్లను రాబట్టింది. మూడో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండగ రోజున అందరి అంచనాలను మించి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల వరకు వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాల బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ తర్వాత రోజుకు మినియం రూ. 10 కోట్ల వసూళ్లతో దూకుడు మీదుంది. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఈ సినిమా మొత్తంగా 2.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే.. ఒక్క యూఎస్‌లోనే 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. అమెరికాలో ‘అ..ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత  వీర రాఘవ’ తర్వాత ‘అల వైకుంఠపుమురములో’ 2 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన నాల్గో చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

ala vaikunthapurramloo 6 days collections movie entered into 100 crore club,ala vaikunthapurramloo 6 days collections,ala vaikunthapurramloo world wide collections, ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo 4th day collections, ala vaikunthapurramuloo box office collections,ala vaikunthapurramuloo 3rd day collections,ala vaikunthapurramuloo 2nd day collections,ala vaikunthapurramuloo 2nd day world wide collections,allu arjun,allu arjun ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo,ala vaikuntapurramuloo,ala vaikunthapurramulo 1st day collections,ala vaikunta puram lo,ala vaikunthapurramulo 1st day worldwide collections,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo day 1 collections report,ala vaikunthapurramuloo songs,alavaikunthapurramloo 1st day collections,allu arjun about ala vaikuntapuram lo movie,ala vaikunta puram lo songs,telugu cinema,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో తొలిరోజు వసూళ్లు,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో 2 రోజుల కలెక్షన్స్,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో బాక్సాఫీస్ కలెక్షన్స్,అల వైకుంఠపురములో 4 రోజుల వసూళ్లు,అల వైకుంఠపురములో 4 డేస్ కలెక్షన్స్,అల వైకుంఠపురములో 6 డేస్ కలెక్షన్స్,అల వైకుంఠపురములో వాల్డ్ వైడ్ కలెక్షన్స్
అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన ‘అల వైకుంఠపురములో(Twitter/Photo)’


ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్‌కు బన్ని యాక్టింగ్ తోడై ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. మొత్తంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో ‘అల వైకుంఠపురములో’ ఆరు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 82 కోట్ల షేర్ వసూళు చేసినట్టు బాక్సాఫీస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కర్ణాటకలో రూ. 8.5 కోట్లు, తమిళనాడు, కేరళ, మిగిలిన రెస్టాఫ్ ఇండియాలో రూ.కోటి చొప్పున..మొత్తంగా రూ. 3 కోట్లు వసూళు చేసింది. యూఎస్‌లో దాదాపు రూ.8 కోట్లు వసూళు చేసిన ఈ సినిమా మిగిలిన ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 3 కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘అల వైకుంఠపురములో’ రూ. 104 కోట్ల షేర్ వసూళు చేసినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లోబ్రేక్ ఈవెన్ కావడంతో ఈ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఆనందంగా ఉన్నారు. ఇక శని వారం, రేపు ఆదివారం సెలవుల్లో ఈ సినిమా ఇంకెంత వసూళ్లను రాబడుతోందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 18, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading