ALA VAIKUNTHAPURRAMLOO 1ST WEEK WORLD WIDE COLLECTIONS ALLU ARJUN TRIVIKRAM MANIA STILL CONTINUES AT BOX OFFICE TA
‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వసూలు చేసిందంటే..
అల వైకుంఠపురములో పోస్టర్ (ala vaikuntapurramuloo)
అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి వారంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత వసూలు చేసిందంటే..
అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే వాల్డ్ వైడ్‌గా ’అల వైకుంఠపురములో’ దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా సెకండ్ డే ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ.10.25 కోట్లను రాబట్టింది. మూడో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండగ రోజున అందరి అంచనాలను మించి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల వరకు వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాల బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ తర్వాత రోజుకు మినియం రూ. 10 కోట్ల వసూళ్లతో దూకుడు మీదుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా మొత్తంగా 2.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే.. ఒక్క యూఎస్‌లోనే 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. 7వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.8 నుంచి 9 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రూ. 100 కోట్ల క్లబ్బులో ఎంటరైన ‘అల వైకుంఠపురములో’ (Twitter/Photo)
ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్‌కు బన్ని యాక్టింగ్ తోడై ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. మొత్తంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో ‘అల వైకుంఠపురములోఏడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 89 కోట్ల షేర్ వసూళు చేసినట్టు బాక్సాఫీస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కర్ణాటకలో రూ. 8.5 కోట్లు, తమిళనాడు, కేరళ, మిగిలిన రెస్టాఫ్ ఇండియాలో రూ.కోటి చొప్పున..మొత్తంగా రూ. 3.5 కోట్లు వసూళు చేసింది. యూఎస్‌లో దాదాపు రూ.9 కోట్లు వసూళు చేసిన ఈ సినిమా మిగిలిన ఓవర్సీస్ మార్కెట్లో రూ. 3.5 కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘అల వైకుంఠపురములో’ రూ. 113 కోట్ల షేర్ వసూళు చేసినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లోబ్రేక్ ఈవెన్ కావడంతో ఈ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఆనందంగా ఉన్నారు. ఈ రోజు ఆదివారం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా సినిమా భవిష్యత్తు ఏమిటనేది సోమవారంతో తేలిపోనుంది.