అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్.. అల వైకుంఠపురములో వేడుక రద్దు..

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 11 రోజులుగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేస్తుంది. ఇప్పటికే 140 కోట్లకు పైగా షేర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2020, 6:15 PM IST
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్.. అల వైకుంఠపురములో వేడుక రద్దు..
అల వైకుంఠపురములో పోస్టర్ (Source: Twitter)
  • Share this:
అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 11 రోజులుగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేస్తుంది. ఇప్పటికే 140 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక చిత్ర యూనిట్ కూడా చాలాసార్లు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.. సక్సెస్ మీట్స్ కూడా ఏర్పాటు చేసారు. అయినా కూడా సినిమాను ఇంత పెద్ద విజయం చేసినందుకు మరోసారి ఆడియన్స్‌ను కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు మేకర్స్. అందుకే తిరుపతిలో భారీ ఈవెంట్ కూడా ప్లాన్ చేసారు. అయితే ఇదిప్పుడు క్యాన్సిల్ అయింది.

Ala Vaikuntapurramuloo Tirupati event cancelled by makers and here the real reason behind it pk అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 11 రోజులుగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేస్తుంది. ఇప్పటికే 140 కోట్లకు పైగా షేర్.. Ala Vaikuntapurramuloo Tirupati event,Ala Vaikuntapurramuloo collections,Ala Vaikuntapurramuloo movie collections,Ala Vaikuntapurramuloo allu arjun,Ala Vaikuntapurramuloo Tirupati event cancel,Allu Arjun,Allu Arjun uncle dies,Allu Arjun uncle dies heart attack,allu arjun Muttamsetty Rajendra Prasad,Muttamsetty Rajendra Prasad death,Muttamsetty Rajendra Prasad heart attack,telugu cinema,aa 20 movie producer Muttamsetty Rajendra Prasad,అల్లు అర్జున్,అల్లు అర్జున్ మేనమామ మరణం,అల్లు అర్జున్ మేనమామ గుండెపోటుతో మృతి,ముత్తంశెట్టి ప్రసాద్ మరణం,తెలుగు సినిమా
అల్లు అర్జున్ మేనమామ మరణం


దానికి కారణం అల్లు అర్జున్ మేనమామ రాజేంద్రప్రసాద్ కన్నుమూయడమే. జనవరి 24న తిరుపతిలో భారీగా జరగాల్సిన ఈ వేడుకను రద్దు చేసారు దర్శక నిర్మాతలు. జనవరి 22న అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూసారు. ఈమె అల్లు అర్జున్ తల్లి నిర్మలకు సొంత అన్నయ్య. అంతేకాదు బన్నీ నెక్ట్స్ సినిమా నిర్మాతల్లో ఒకరు కూడా. సుకుమార్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు ప్రసాద్. అంతలోనే ఇలా ఆయన చనిపోవడం అల్లు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. విజయానందంలో ఉన్న అల్లు ఫ్యామిలికి ప్రసాద్ మరణం తీరనిశోకం మిగిల్చింది.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు