అల వైకుంఠపురములో టీజర్ ఆలస్యం.. అసలు కారణం అదే..

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 11:42 AM IST
అల వైకుంఠపురములో టీజర్ ఆలస్యం.. అసలు కారణం అదే..
అల వైకుంఠపురములో సాంగ్ (Source: Youtube)
  • Share this:
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సంక్రాంతి కోసం చూస్తున్నారు అభిమానులు. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. దాంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన పాత్ర డబ్బింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే అన్నయ్యగా సుశాంత్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈయన పాత్ర సినిమాలో కీలకం కానుంది. కచ్చితంగా ఈ కారెక్టర్ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు సుశాంత్.జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్, బన్నీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఇప్పుడు బన్నీ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇప్పుడు టీజర్ డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆలస్యం అయింది. మెగా అభిమాన సంఘ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ ఆకస్మిక మరణంతో ఈ టీజర్ టైమ్ మార్చేసారు దర్శక నిర్మాతలు. మరికాసేపట్లో టైమ్ ప్రకటిస్తామని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. హారిక హాసినితో కలిసి గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>