త్రివిక్రమ్‌కు లీగల్ నోటీసులు.. అల వైకుంఠపురములో కాపీ అంటూ..

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్యే తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమా ఎలాంటి విజయం అందుకుందో కూడా చెప్పనక్కర్లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2020, 12:00 PM IST
త్రివిక్రమ్‌కు లీగల్ నోటీసులు.. అల వైకుంఠపురములో కాపీ అంటూ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)
  • Share this:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్యే తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమా ఎలాంటి విజయం అందుకుందో కూడా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులను అల వైకుంఠపురములో సినిమాతో తిరగరాసాడు ఈ దర్శకుడు. నెల రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్‌కి లీగల్ సమస్యలు వచ్చి పడేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. అల వైకుంఠపురములో సినిమా కథ తనదే అంటూ ఇప్పుడు ఈ దర్శకుడిపై లీగల్ కేస్ నమోదైంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)


మరో దర్శకుడు చెప్పిన కథను తీసుకుని ఈ సినిమాను త్రివిక్రమ్ తీసాడంటూ ఈయనపై ఆరోపణలు వస్తున్నాయిప్పుడు. చిన్న సినిమాలకు రచయితగా పని చేస్తున్న కృష్ణ అనే అప్ కమింగ్ దర్శకుడు 2005లో త్రివిక్రమ్‌ని కలిసి ఇదే కథను చెప్పాడని తెలుస్తుంది.. 2013లో ఈ కథని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాడని.. అయితే తన స్క్రిప్ట్ ఫస్ట్ పేజ్ కాపీని దర్శకుడు త్రివిక్రమ్‌కి అప్పట్లో ఇచ్చానని కూడా చెబుతున్నాడు ఈయన. అయితే తన కథతో అల వైకుంఠపురములో చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించాడని ఆరోపిస్తున్నాడు ఈ దర్శకుడు. తాను చెప్పిన కథని దశ దిశ అనే టైటిల్‌తో తెరకెక్కించాలనుకున్నానని.. కాని ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తన కథను వాడేసుకున్నాడని చెబుతున్నాడు కృష్ణ.

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)
ఆయనకి లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు కృష్ణ. అయితే సినిమా విడుదలైన తర్వాత వెంటనే చెప్పకుండా నెల రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడు హైలైట్ చేస్తున్నావ్ అంటూ కృష్ణకు సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అది నీ కథ అవునా కాదా అని తెలుసుకోడానికి నెల రోజులు పట్టిందా.. రోజుకో సీన్ చూసి ఇది నీ కథ అని డిసైడ్ చేసుకున్నావా అంటూ ఈయన్ని త్రివిక్రమ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి పనులు చేస్తున్నావా అంటూ ఆడుకుంటున్నారు. కానీ కృష్ణ మాత్రం తన కథనే త్రివిక్రమ్ కాపీ చేసాడని చెబుతున్నాడు. మరి చూడాలిక.. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో..? గతంలోనూ అజ్ఞాతవాసి సినిమా సమయంలో లార్గో వించ్ దర్శకుడి నుంచి విమర్శలు అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు