అల వైకుంఠపురములో 4 రోజుల వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర బన్ని, త్రివిక్రమ్‌ల మాయ..

అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. సంక్రాంతి రోజున ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

news18-telugu
Updated: January 16, 2020, 12:54 PM IST
అల వైకుంఠపురములో 4 రోజుల వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర బన్ని, త్రివిక్రమ్‌ల మాయ..
‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. ఫస్ట్ డే వాల్డ్ వైడ్‌గా ’అల వైకుంఠపురములో’  దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా సెకండ్ డే ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ.10.25 కోట్లను రాబట్టింది. మూడో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండగ రోజున అందరి అంచనాలను మించి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల వరకు వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాల బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా మూడు రోజు కంటే సంక్రాంతి రోజున ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్‌కు బన్ని యాక్టింగ్ తోడై ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. మొత్తంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ. 57 కోట్ల షేర్ రాబడితే.. ఓవర్సీస్ కర్ణాటక, రెస్ట్ ఆప్ ఇండియా కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల షేర్‌ కొల్లగొట్టింది. 

ala vaikuntapurramuloo movie 3rd day Worldwide collections and allu arjun trivikram mania continues at box office,ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo box office collections,ala vaikunthapurramuloo 3rd day collections,ala vaikunthapurramuloo 2nd day collections,ala vaikunthapurramuloo 2nd day world wide collections,allu arjun,allu arjun ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo,ala vaikuntapurramuloo,ala vaikunthapurramulo 1st day collections,ala vaikunta puram lo,ala vaikunthapurramulo 1st day worldwide collections,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo day 1 collections report,ala vaikunthapurramuloo songs,alavaikunthapurramloo 1st day collections,allu arjun about ala vaikuntapuram lo movie,ala vaikunta puram lo songs,telugu cinema,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో తొలిరోజు వసూళ్లు,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో 2 రోజుల కలెక్షన్స్,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో బాక్సాఫీస్ కలెక్షన్స్,
‘అల వైకుంఠపురములో’ 3 డేస్ కలెక్షన్స్ (Twitter/Photos)


మొత్తంగా చూసుకుంటే ఓవర్సీస్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్  మేనియా చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తంగా రూ.85 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లో రూ. 73కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. మొత్తంగా మరో రూ. 11 కోట్లు వసూళ్లు సాధిస్తేకానీ.. బ్రేక్ ఈవెన్ కాదు. మొత్తంగా సంక్రాంతి సినిమాల పరంగా చూసుకుంటే.. ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లే అవకాాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>