ALA VAIKUNTAPURRAMULOO MOVIE 2ND DAY WORLDWIDE COLLECTIONS AND ALLU ARJUN SCORES BIG AT BOX OFFICE TA
‘అల.. వైకుంఠపురములో’ 2 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ ఊచకోత..
‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ (Twitter/Photo)
‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర..
‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకుపోతుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన హాట్రిక్ సినిమా ‘అల.. వైకుంఠపురములో’. ఈ చిత్రం ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది.రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా సెకండ్ డే ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ.10.25 కోట్లను రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొత్తంగా రెండు రోజుల్లో నైజాంలో రూ. 10.03 కోట్లు కలెక్ట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 5.47 కోట్లు రాబట్టింది. ఉత్తరాంధ్రలో రూ.4.54 కోట్లు రాబడితే.. తూర్పు గోదావరిలో రూ.3.63 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 3.27 కోట్లు, గుంటూరు రూ.4.21 కోట్లు, కృష్ణాలో రూ. 3.44 కోట్లు, నెల్లూరులో రూ.1.59 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తెలంగాణ,ఏపీలో కలిపి రూ.36.18 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటకలో ఈ సినిమా రెండు రోజుల్లో కలిపి రూ.3.78 వసూళ్లు సాధిస్తే.. మిగతా భారతదేశంలో రూ.1.43 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్లో ఈ సినిమా రూ.10 కోట్లకు పైగా రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. మొత్తంగా రూ.85 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రెండు రోజుల్లో రూ.50 కోట్ల షేర్.. రూ.75 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. మొత్తంగా మరో రూ. 33 కోట్లు వసూళ్లు సాధిస్తేకానీ.. బ్రేక్ ఈవెన్ కాదు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.