• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • ALA VAIKUNTAPURRAMULOO BUTTABOMMA FULL VIDEO SONG REACHED 300 MILLION VIEWS IN YOUTUBE PK

ButtaBomma Full Video Song: 300 మిలియన్ క్లబ్బులో బుట్టబొమ్మ..

‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ సాంగ్ (Twitter/Photo)

Butta Bomma song: అల్లు అర్జున్ అల వైకుంఠపురములో విడుదలై 8 నెలలు కావొస్తున్నా కూడా ఇప్పటికీ రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే సంచలన విజయం..

  • Share this:
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో విడుదలై ఆర్నెళ్లు కావొస్తున్నా కూడా ఇప్పటికీ రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే సంచలన విజయం సాధించాయి. తమన్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్. సినిమా పరంగా దుమ్ము దులిపేసిన అల వైకుంఠపురములో పాటల విషయంలో కూడా సంచలనం సృష్టిస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

ఇక రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఈ పాట మొదట్లో కాస్త నెమ్మదిగానే అనిపించినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ము దులిపేసింది. నిదానమే ప్రధానం అన్నట్లు.. టిక్ టాక్, డబ్ స్మాష్ ఎక్కడ చూసినా కూడా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 300 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ చిత్రంలోని 'రాములో రాములా' సాంగ్ 172 మిలియన్ వ్యూస్ వచ్చాయి.


'సామజవరగమన' కూడా 189 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు బుట్టబొమ్మ కూడా 300 మిలియన్ క్లబ్‌లో జాయిన్ అయిపోయింది. అత్యంత వేగంగా 300 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న తొలిపాట బుట్టబొమ్మ అంటూ థమన్ ట్వీట్ చేసాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్‌, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. మొత్తానికి తమన్ కెరీర్‌లో అల వైకుంఠపురములో అలా ప్రత్యేకంగా నిలిచిపోయిందన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published: