ఏ ముహూర్తాన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో స్టార్ట్ చేశాడో కానీ.. సినిమా విడుదలై నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా విడుదల కాకుండానే లిరికల్ సాంగ్స్ యూ ట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్‌తో సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. సినిమా విడుదల తర్వాత వచ్చిన వీడియో సాంగ్స్ కూడా యూ ట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుని రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా సాంగ్స్‌తో పోటీ పడుతూ ఈ సినిమా ట్రైలర్ కూడా వ్యూస్ పరంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అల వైకుంఠపురములో ట్రైలర్ ఇప్పుడు వ్యూస్ పరంగా జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డై ట్రైలర్ వ్యూస్‌ను క్రాస్ చేసి టాప్ 20 ట్రైలర్ వ్యూస్‌లో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఇలా ట్రైలర్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసిన దక్షిణాది సినిమా అల వైకుంఠపురములో కావడం విశేషం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. రెండు వందల అరవై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. సినిమాల్లోని పాటల్లో సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ లిరికల్, వీడియో సాంగ్స్ వ్యూస్ పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. బన్నీ సినిమా ఇలా రికార్డుల మీదు రికార్డులను సాధిస్తుండటంపై ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ప్యాన్ ఇండియా రేంజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా సుకుమార్‌తో కలిసి పుష్ప సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను స్టార్ట్ చేసుకున్నప్పటికీ కోవిడ్ ప్రభావ కారణంగా క్యాన్సిల్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్ దర్శకత్వలో బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నట్లు టాక్. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం బన్నీ గడ్డం పెంచి, సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Trivikram Srinivas