Home /News /movies /

ALA VAIKUNTAPURAMULO HINDI DUBBED VERSION MAY NOT BE RELEASED DUE TO ITS REMAKE VERSION SHEHZADA AK

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్‌లో ఆ సినిమా రిలీజ్‌కు బ్రేక్.. అంతా అల్లు అరవింద్ వల్లే..

Allu Arjun Photo : Twitter

Allu Arjun Photo : Twitter

Ala Vaikuntapuramulo: అల వైకుంఠపురములో సినిమాను డబ్ చేసి ధియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారనే ప్రకటన వచ్చినప్పటికి నుంచే ఈ సినిమా షెహజాదా ప్రొడ్యూసర్లను టెన్షన్ పెడుతోంది.

    పుష్ప మూవీ బాలీవుడ్ ఆడియెన్స్‌ను బాగా నచ్చేయడంతో.. అల్లు అర్జున్ నటించిన మరికొన్ని హిట్ సినిమాలను డబ్ చేసి బాలీవుడ్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ నెల 26న ఈ సినిమా హిందీ వర్షన్ ధియేటర్లలో విడుదల కావడమే మిగిలింది. అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. అల వైకుంఠపురములో హిందీ వర్షన్ ధియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇందుకు అసలు కారణం అల వైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్ షెహజాదా సినిమా. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరేశ్ రావల్, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

    అల వైకుంఠపురములో సినిమాను డబ్ చేసి ధియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారనే ప్రకటన వచ్చినప్పటికి నుంచే ఈ సినిమా షెహజాదా ప్రొడ్యూసర్లను టెన్షన్ పెడుతోంది. దీంతో ఈ సినిమా నిర్మాతలైన అల్లు అరవింద్ అమన్ గిల్, భూషణ్ కుమార్.. సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్న మనీష్ షాతో చర్చలు జరిపారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం మనీష్ షా అల వైకుంఠపురములో హిందీ వర్షన్‌ను ధియేటర్లలో విడుదల చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన ఈ డబ్బింగ్ వర్షన్‌ను యూట్యూబ్, సాటిలైట్ ఛానల్స్‌లో రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    పుష్ఫ సినిమాకు ముందు అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో అంతగా క్రేజ్ లేదు. తెలుగు తరువాత మలయాళంలో మాత్రమే అల్లు అర్జున్‌కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ పుష్ప సినిమాతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బాలీవుడ్ ఆడియెన్స్‌కు పుష్ప ఫుల్లుగా నచ్చేసింది. పుష్పలో అల్లు అర్జున్ గెటప్, డైలాగ్స్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. బాలీవుడ్‌లో ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    Allu Arjun - Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ మరో తిరుగులేని రికార్డు.. తగ్గేదేలే అంటున్న బన్ని..

    Allu Arjun - Pushpa : డెల్టా అయినా.. ఓమైక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే అంటున్న ‘పుష్ప రాజ్’.. వైరల్ అవుతున్న కేంద్ర ప్రభుత్వ ట్వీట్..

    అంతకుమించి బాలీవుడ్ ఆడియెన్స్‌కు అల్లు అర్జున్‌ను దగ్గర చేసింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం మాస్ పెట్టుకోవాలని చెప్పే క్యాంపెయిన్ కోసం అల్లు అర్జున్ పోస్టర్, డైలాగ్ వాడేసిందంటే.. పుష్ఫ మూవీ ప్రభావం బాలీవుడ్ ఆడియెన్స్‌పై ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి పుష్ప తరువాత అల వైకుంఠపురమలో సినిమాను ధియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దామని ఎదురుచూస్తున్న బన్నీ బాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ala Vaikuntapuramlo, Allu Arjun

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు