హోమ్ /వార్తలు /సినిమా /

అల్లు అర్జున్ సామజవరగమన.. అల వైకుంఠపురములో మెలోడీ..

అల్లు అర్జున్ సామజవరగమన.. అల వైకుంఠపురములో మెలోడీ..

అల వైకుంఠపురములో పోస్టర్ (Source: Twitter)

అల వైకుంఠపురములో పోస్టర్ (Source: Twitter)

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని చిన్న మెలోడీ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఎప్పుడూ రొటీన్ ట్యూన్స్‌తో విసుగు పుట్టించే తమన్ మాటల మాంత్రికుడికి మాత్రం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడు. అరవింద సమేత సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు తమన్. ఇప్పుడు మరోసారి ఇదే చేస్తున్నాడు. తాజాగా బన్నీ సినిమా కోసం సామజవరగమన సాంగ్ 20 సెకన్ల లిరిక్ విడుదలైంది. త్వరలోనే పూర్తి పాట రానుంది.

' isDesktop="true" id="319778" youtubeid="hUfn-d-nocs" category="movies">

సంచలన గాయకుడు సిడ్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు. తమన్ అద్భుతమైన ట్యూన్ ఇవ్వడంతో 20 సెకన్లే అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ పాట. అక్టోబర్ 8న దసరా కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల కానుందని తెలుస్తుంది. ఇక 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. అరవింద సమేత తర్వాత మరోసారి త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తుంది.

Ala Vaikuntapuramlo Samajavaragamana Out Soon and Allu Arjun fans are waiting pk అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని.. allu arjun facebook,allu arjun instagram,Ala Vaikuntapuramlo Samajavaragamana,Trivikram Srinivas,Trivikram Srinivas twitter,Allu Arjun,Allu Arjun twitter,Ala Vaikuntapuramlo movie,Ala Vaikuntapuramlo movie teaser,Ala Vaikuntapuramlo movie teaser dasahara,telugu cinema,అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్,అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్,అల వైకుంఠపురములో,తెలుగు సినిమా
అల్లు అర్జున్ పూజా హెగ్డే

ఇక డీజే తర్వాత బన్నీతో మరోసారి జోడీ కట్టింది ఈ ముద్దుగుమ్మ. విడుదలకు ముందే ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ ఇప్పటికే సన్ నెక్స్ట్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ తీసుకుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. మరోసారి తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో వస్తుంది ఈ చిత్రం.

First published:

Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Telugu Cinema, Tollywood, Trivikram

ఉత్తమ కథలు