హోమ్ /వార్తలు /సినిమా /

అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ వచ్చేసింది..

అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ వచ్చేసింది..

అల వైకుంఠపురంలో పోస్టర్

అల వైకుంఠపురంలో పోస్టర్

సామజవరగమన పాట అయితే విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ అవుతూనే ఉంది. యూ ట్యూబ్‌లో రికార్డులను తిరగరాసింది ఈ పాట.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. 2020 జనవరి 12న సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఓ చేతిలో పందెం కోడి, మరో చేతిలో కత్తి పట్టుకుని తలపాగా కట్టుకున్న అల్లు అర్జున్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. గత పోస్టర్లలో చూపించినట్టే ఈ పోస్టర్‌లో కూడా నోట్లో బీడీ ఉంది. దీంతో ఇది పల్లెటూరి మాస్ తరహాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో కూడా తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ కానుందని తెలుస్తుంది. తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

అల వైకుఠపురములో అల్లు అర్జున్

దానికితోడు సామజవరగమన పాట అయితే విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ అవుతూనే ఉంది. యూ ట్యూబ్‌లో రికార్డులను తిరగరాసింది ఈ పాట. తాజాగా విడుదలైన దసరా పోస్టర్ కూడా పిచ్చెక్కిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

First published:

Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Trivikram Srinivas

ఉత్తమ కథలు