యాంకర్ సుమపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పటికే విడుదలైన పాటలు యూబ్యూట్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సంక్రాతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురంలో సినిమా విడుదల కానుంది.

news18-telugu
Updated: January 7, 2020, 2:46 PM IST
యాంకర్ సుమపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సుమ, త్రివిక్రమ్
  • Share this:
యాంకర్ సుమ..! ఈమె గురించి తెలుగు సినీ, టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అల్లరి మాటలు, కామెడీ కబుర్లతో ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. టీవీ షోలతో పాటు సినీ ఈవెంట్లతో సుమ 365 డేస్ బిజీగా ఉంది. సోమవారం జరిగిన అల వైకుంఠపురం మ్యూజికల్ నైట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది సుమ. ఈ కార్యక్రమంలో యాంకర్ సుమపై డైరెక్టర్ తివిక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యూజిక్ నైట్ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించావని.. నేత్రోత్సవంగా నిర్వహించావని కొనియాడారు. మా దిష్టే తగిలేలా ఉందని.. ఇంటికెళ్లి దిష్టి తీయించుకోమని సలహా ఇచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

''సుమా.. నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకంటే వయసులో చిన్నవారు. మీకు అభినందనలు. మాయాబజార్‌ సినిమాలో ఎస్వీరరంగారావు నేత్రోత్సవం అని చెబుతారు. అలా ఈ మ్యూజిక్ ఈవెంట్‌లో ఎంతో నేత్రోత్సవంగా యాంకరింగ్ చేశారు. ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకోండి. మా అందరి దిష్టే తగిలేలా ఉంది.'' అని త్రివిక్రమ్ అన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా 'అల వైకుంఠపురంలో'. ఈ చిత్రానికి తివిక్రమ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పక్కన నివేదా పేతురాజ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక టబు, సుశాంత్, హర్ష వర్ధన్, సునీల్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూబ్యూట్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సంక్రాతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురంలో సినిమా విడుదల కానుంది.
First published: January 7, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading