AKSHAYE KHANNA JOINS AJAY DEVGN AND TABU IN DRISHYAM 2 SB
Drishyam 2: దృశ్యం2 హిందీ రీమేక్‌లో.. కీలకపాత్రలో అక్షయ్ ఖన్నా..
దృశ్యం2లో అక్షయ్ ఖన్నా
మళయాళం, తెలుగులో హిట్ అయిన దృశ్యం 2 సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌లో అజయ్ దేవ్ గన్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తోండగా.. అక్షయ్ ఖన్నా...మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
2014లో మళయాళ సినిమా "దృశ్యం" కి ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు. దానిని మలయాళ సీమకే పరిమితం చేయకుండా తెలుగులో కూడా తీసారు. మళ్లీ అన్ని ప్రశంశలూ దక్కాయి. మళ్లీ ఈ 2021 ఓటీటీ యుగంలో మళయాళంలో దృశ్యం-2 సీక్వెల్ వచ్చింది. ఓటీటీ ద్వారా అందర్నీ చేరింది. శభాషనిపించుకుంది. అయినా సరే వ్యయ ప్రయాసలకోర్చి మళ్లీ తెలుగులో తీసారు. అది కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఇక తెలుగులో వెంకటేష్, మీనా తీస్తే.. ఇదే దృశ్యం సినిమాను.. హిందీలో అజయ్ దేవగణ్, శ్రీయ జంటగా నటిస్తే.. టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు.
ఇప్పుడు మలయాళ సూపర్‌హిట్ 'దృశ్యం-2'కి రీమేక్‌గా అజయ్ దేవగణ్, టబు కలిసి మరోసారి హిందీలో 'దృశ్యం-2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్షయ్ ఖన్నా కీలకపాత్రకి ఎంపికైనట్టు కథానాయిక టబు శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ''దిల్ చాహ్తా హై', 'హంగామా', 'రేస్'లాంటి సినిమాలతో మెప్పించిన నటుడు అక్షయ్ మా బృందంలోకి చేరడం సంతోషంగా ఉంది'' అంటూ ఆమె పోస్ట్ చేశారు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు విజయ్ సాల్గాంకర్. భూషణ్‌కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్కుమార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక దృశ్యం సినిమాలో చూపించిన విధంగానే... దృశ్యం2లో కూడా విజయ్ సల్గాంకర్, నందిని సల్గాంకర్ పాత్రలను అజయ్ దేవగన్ , శ్రియా శరణ్ తిరిగి పోషించనున్నారు. దృశ్యంలో ఈ ఇద్దరు నటులు భార్యాభర్తలుగా నటించారు. నిషికాంత్ కామత్ దృశ్యం ఒక ఎమోషనల్ థ్రిల్లర్, ఇది ఒక కేబుల్ ఆపరేటర్ విజయ్ సల్గాంకర్ (అజయ్) కథతో వ్యవహరిస్తుంది, అతని జీవితం ,సినిమా ,అతని కుటుంబం చుట్టూ తిరుగుతుంది; భార్య నందిని (శ్రియా శరణ్) కుమార్తెలు అంజు , అను. ఈ చిత్రంలో టబు ఐజీ మీరా దేశ్‌ముఖ్ పాత్రను పోషిస్తోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.