అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఏ మూవీతో వచ్చినా...బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నాడు. కెరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేసిన అక్షయ్...ఆ తర్వాత కామెడీ బాట పట్టాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్టోన్న ‘మిషన్ మంగళ్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: July 5, 2019, 11:29 AM IST
అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ ఫస్ట్ లుక్ రిలీజ్..
‘మిషన్ మంగళ్’ లో అక్షయ్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఏ మూవీతో వచ్చినా...బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నాడు. కెరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేసిన అక్షయ్...ఆ తర్వాత కామెడీ బాట పట్టాడు. లేటస్ట్‌గా బయోపిక్ మూవీలు చేస్తున్నాడు. ఈ  యేడాది.. 19వ శతాబ్దంలో జరిగిన సారాగర్హి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీలో అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో మెప్పించాడు. తాజాగా అక్షయ్ కుమార్.. సౌర కుటుంబంలో భూమికి అతి దగ్గరగా.. అంతేకాదు ధాదాపు భూ గ్రహంలాగా ఉండే కుజ గ్రహం మీదకు ఉపగ్రహం పంపించిన నేపథ్యంలో ‘మిషన్ మంగళ్’ సినిమా చేస్తున్నాడు. జగన్ శక్తి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేసారు. ‘ది స్కై ఈజ్ నాట్ ది లిమిట్’ అనేది ట్యాగ్ లైన్. అంతేకాదు ప్రయోగాలకు ఆకాషం హద్దుగా భారత దేశం అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్నట్టు ఈ ట్యాగ్‌లైన్ పెట్టారు.

Akshay Kumar's Mission Mangal First Look Released,mission mangal,akshay kumar,mission mangal akshay kumar,mission mangal trailer,akshay kumar mission mangal,mission mangal movie,akshay kumar new movie,mission mangal teaser,mission mangal vs saaho,mission mangal first look,mission mangal story,mission mangal release date,mission mangal official trailer,mission mandal,saaho vs mission mangal,akshay kumar upcoming films,akshay kumar fans,akshay kumar twitter,akshay kumar instagram,akshay kumar facebook,bollywood,hindi cinema,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్,మిషన్ మంగళ్ ఫస్ట్ లుక్ రిలీజ్,మిషన్ మంగళ్ ఫస్ట్ లుక్ విడుదల,మిషన్ మంగళ్ ఫస్ట్ లుక్,
‘మిషన్ మంగళ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ (ట్విట్టర్ ఫోటో)


ఈ మూవీలో అక్షయ్ కుమార్‌తో పాటు విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యామీనన్, కీర్తి కుల్హారితో పాటు శర్మన్ జోషిలు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
First published: July 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading