బాలీవుడ్ బాక్సాఫీస్‌‌ దగ్గర ‘కేసరి’ అరాచకం.. కలెక్షన్స్‌ ఊచకోత కోస్తున్న అక్షయ్ కొత్త సినిమా..

బాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆయనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు అక్షయ్ కుమార్. తాజాగా ఈ కథానాయకుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో ‘కేసరి’ సినిమా చేసాడు.ఇప్పటికే మూడు రోజుల్లో రూ. 78 కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా ఈ సోమవారానికి రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 25, 2019, 1:58 PM IST
బాలీవుడ్ బాక్సాఫీస్‌‌ దగ్గర ‘కేసరి’ అరాచకం.. కలెక్షన్స్‌ ఊచకోత కోస్తున్న అక్షయ్ కొత్త సినిమా..
కేసరి మూవీలో అక్షయ్ కుమార్
  • Share this:
బాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆయనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు అక్షయ్ కుమార్. తాజాగా ఈ కథానాయకుడు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో ‘కేసరి’ సినిమా చేసాడు. మార్నింగ్ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు రోజుల్లో రూ. 78 కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా ఈ సోమవారానికి రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొదటి రోజు రూ.21 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా అదే ఊపులో బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ‘కేసరి’ సినిమా విషయానికొస్తే...1897లో పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంల ఈ చిత్రం తెరకెక్కింది.. 1897లో సిక్ రెజిమెంట్ కు చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్ఘన్లకు పాకిస్థాన్ ల వున్న ‘సారాగర్హీ’ దగ్గర జరిగిన యుద్దాన్నే ఇపుడు కేసరిగా తెరకెక్కించారు.21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ.

Kesari Movie 100 Crore Club
కేసరి మూవీలో అక్షయ్ కుమార్ (ట్విట్టర్ ఫోటో)


అంటే ఒక్కో సిక్కు జవాను..సుమారుగా 476 మందిని చంపారు. నిజంగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి’ సినిమాను తెరకెక్కించారు. ‘కేసరి’లో  అక్కీ.. హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. ‘కేసరి’ అంటే త్యాగానికి గుర్తు. ముందు ముందు ‘కేసరి’ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.

First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు