Akshay Kumar: కరోనా పై ప్రజల్లో అవగాహన కోసం అక్షయ్ కుమార్ ఐదు సూత్రాలు..

అక్షయ్ కుమార్(ఫైల్ పొటో)

Akshay Kumar: గత కొన్ని రోజులుగా దేశ ప్రజలను కరోనా సెకండ్ వేవ్ తీవ్ర కలవరానికి గురి చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ కరోనా ప్రజల్లో అవగాహన కోసం ఐదు సూత్రాలను సూచించారు.

 • Share this:
  Akshay Kumar: గత కొన్ని రోజులుగా దేశ ప్రజలను కరోనా సెకండ్ వేవ్ తీవ్ర కలవరానికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్ విధించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా ఇపుడిపుడే కరోనా తగ్గు ముఖం పడుతోంది. మరోవైపు కొంత మంది సెలబ్రిటీలు ఈ కరోనా కష్టకాలంలో తమ వంతు సాయం చేస్తున్నారు. ఐతే.. బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ కరోనా వచ్చిందని కంగారు పడకుండా ఈ ఐదు సూత్రాలు పాటిస్తే.. కరోనాను జయించవచ్చని ఓ వీడియో వేదికగా తెలిపారు. ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కరోనా పై అవగాహన సదస్సులో అక్షయ్ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఐదు సూత్రాలతో కూడిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

  1. ఈ సందర్భంగా కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో మిగతా వాళ్లు ఎవరితో కలవకుండా ప్రత్యేక గదిలో మినిమం 10 రోజుల పాటు ఐసోలేట్ కావాలన్నారు.

  2. కరోనా సోకిన వ్యక్తులు ఫోన్ ద్వారా డాక్టర్లను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకొని మందులు వేసుకోవాలనన్నారు.

  3. ఇక కరోనా బారిన పడిన వాళ్లు తమ చేతులను ఎపుడు సబ్బు, లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు.

  4. కరోనా సోకిన వ్యక్తులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

  5.ఒక ఊపిరి తీసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లాలి.
  View this post on Instagram


  A post shared by Akshay Kumar (@akshaykumar)

  ఈ అవగాహన కార్యక్రమంలో పునీత్ రాజ్‌కుమార్, ఆర్య కూడా భాగం కానున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్య వంశీ’తో పాటు ‘బెల్ బాటమ్’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మరోవైపు ఈయన ‘అతరంగీ రే’ తో పాటు ‘బచ్చన్ పాండే’ ‘పృథ్వీరాజ్ చౌహాన్’ సినిమాలు చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: