బాలీవుడ్‌లో ఏ హీరో చేయనట్టుగా వరుస సినిమాలతో అక్షయ్ కుమార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే ‘కేసరి’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు అక్షయ్ కుమార్. మరోవైపు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో చేసిన ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమా దసరాకు రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు అక్షయ్ కుమార్..‘మిషన్ మంగళ్’ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. అంతేకాదు కరీనా కపూర్‌తో ‘గుడ్ న్యూస్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా లారెన్స్ దర్శకత్వంలో కాంచన 2 రీమేక్‌కు ఓకే చెప్పిన అక్షయ్ కుమార్.. ఇపుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవంశీ’ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఎపుడో ఓకే అయిన ఈ సినిమా ఈ రోజే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించనుంది.
The cop universe just got bigger as #Sooryavanshi takes charge!
— Akshay Kumar (@akshaykumar) May 6, 2019
@ajaydevgn @RanveerOfficial #RohitShetty @karanjohar #KatrinaKaif #KareenaKapoor #SaraAliKhan @RSPicturez @RelianceEnt @DharmaMovies #CapeOfGoodFilms pic.twitter.com/DjUvulZYAw
ఈ సందర్భంగా రణ్‌వీర్, అజయ్, అక్షయ్‌లు ‘సింబా’,సింగం సిరీస్’,సూర్యవంశీ’ చిత్రాలకు సంబంధించిన క్లాప్ బోర్దులు పట్టుకొని రోహిత్ శెట్టి, కరణ్ జోహార్‌లతో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. సామ్రాజ్యం పెద్దదైంది. మా ఆట మొదలైంది. అని ట్వీట్ చేసారు. సూర్య వంశీ చిత్రంలో అజయ్,రణ్‌వీర్‌లు సింగం,సింబా పాత్రల్లో అతిథులుగా కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajay Devgn, Akshay Kumar, Bollywood, Hindi Cinema, Karan Johar, Ranveer Singh, Rohit shetty