గత కొన్నేళ్లుగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ వస్తోన్న అక్షయ్ కుమార్..మరోసారి సౌత్‌లో హిట్టైన ‘కాంచన’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్‌తో దర్శకుడిగా రాఘవ లారెన్స్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తాాజగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హిందీలో ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబాయిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా కియరా క్లాప్ కొడుతోన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించిన శరత్ కుమార్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా ఈ హిందీ రీమేక్‌లో ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయడానికి అమితాబ్ బచ్చన్ ఓకే చెప్పినట్టు సమాచారం.
ముందుగా ఈ పాత్ర కోసం అజయ్ దేవ్‌గణ్‌ను అనుకున్నా...ఫైనల్‌గా ఈ పాత్ర బిగ్‌బీ చేయనున్నట్టు సమాచారం. గతంలో అమితాబ్ బచ్చన్..‘లావారిస్’ సినిమాలో ‘మేరే అంగనేమే’ పాటలో పేడి పాత్రను పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే కదా.

కాంచన 2 రీమేక్ లో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అమితాబ్ బచ్చన్
ఇపుడు చాలా ఏళ్ల తర్వాత మరోసారి ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సౌత్ రీమేక్‌లతో బాలీవుడ్లో రచ్చ చేసిన అక్షయ్..ఇపుడీ రీమేక్‌తో మరో సక్సెస్ అందుకుంటాడా లేదా చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 29, 2019, 12:28 IST