బ‌తికుంటే ఇంటికి రా చంపేస్తా.. అక్ష‌య్ కుమార్‌కు భార్య ట్వింకిల్ వార్నింగ్..

అవును.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్‌కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చింది ఆయ‌న భార్య ట్వింకిల్ ఖ‌న్నా. ఎందుకు అంత‌గా ఆయ‌న‌పై ఈమె సీరియ‌స్ అయింది అనుకుంటున్నారా..? ఉంది.. దానికి కూడా కార‌ణం ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 6, 2019, 3:24 PM IST
బ‌తికుంటే ఇంటికి రా చంపేస్తా.. అక్ష‌య్ కుమార్‌కు భార్య ట్వింకిల్ వార్నింగ్..
ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్‌కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చింది ఆయ‌న భార్య ట్వింకిల్ ఖ‌న్నా. ఎందుకు అంత‌గా ఆయ‌న‌పై ఈమె సీరియ‌స్ అయింది అనుకుంటున్నారా..? ఉంది.. దానికి కూడా కార‌ణం ఉంది. ఇప్పుడు ఈమె చేసిన ఓ ట్వీట్.. ఆయ‌న చేసిన ఓ ఫీట్.. సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అమేజాన్ ప్రైమ్ తో ది ఎండ్ అనే వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు అక్ష‌య్ కుమార్. దీని కోసం దాదాపు 35 కోట్ల‌కు పైగానే డీల్ కుదుర్చుకున్నాడ‌ని తెలుస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు టీవీ షోలు కూడా చేస్తున్నాడు అక్ష‌య్.
Akshay Kumar Wife Twinkle Khanna Strong warning.. Come home i will kill you she tweets pk.. అవును.. ఇప్పుడు నిజంగానే అక్ష‌య్ కుమార్‌కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చింది ఆయ‌న భార్య ట్వింకిల్ ఖ‌న్నా. ఎందుకు అంత‌గా ఆయ‌న‌పై ఈమె సీరియ‌స్ అయింది అనుకుంటున్నారా..? ఉంది.. దానికి కూడా కార‌ణం ఉంది. twinkle khanna,twinkle khanna twitter,akshay kumar twinkle khanna,akshay kumar fires on body,twinkle khanna instagram,twinkle khanna movies,amazon prime video,amazon prime video akshay kumar,amazon prime video deal with Akshay kumar,amazon prime video the end web series,amazon prime video the end web series akshay kumar,netflix movies,hotstar movies,amazon prime movies,akshay kumar movies,akshay kumar twitter,hindi cinema,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్‌పై ఫైర్ అయిన ట్వింకిల్ ఖన్నా,అక్షయ్ కుమార్ అమేజాన్ ప్రైమ్,అమేజాన్ ప్రైమ్‌లో అక్షయ్ కుమార్,ది ఎండ్ వెబ్ సిరీస్ అక్షయ్ కుమార్ అమేజాన్ ప్రైమ్ వీడియో,నెట్ ఫ్లిక్స్,హాట్ స్టార్ మూవీస్
ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్

ఇదిలా ఉంటే ఇందులో భాగంగానే ఆయ‌న ఒంటికి నిప్పు పెట్టుకుని అక్క‌డ ఓ ఫీట్ చేసాడు. అది చూసి అక్క‌డున్న వాళ్ల‌తో పాటు అంతా షాక్ అయ్యారు. ఆ షాక్ అయిన వాళ్ల లిస్టులో అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా కూడా ఉంది. ఒంటిపై మంట‌ల‌తో అలా వ‌చ్చిన అక్ష‌య్ కుమార్ ను చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అయినా ఖిలాడీకి ఇలాంటి ఫీట్స్ కొత్తేం కాదు. అయితే మ‌రీ ఒంటిపై మంట‌ల‌తో రావ‌డం మాత్రం కాస్త రిస్క్. అది తెలిసి కూడా అక్ష‌య్ కుమార్ చేసి చూపించాడు.


ఇది చూసిన త‌ర్వాత ట్వింకిల్ ఖ‌న్నా చాలా సీరియ‌స్ అయింది. ట్విట్ట‌ర్లో వార్నింగ్ ఇచ్చింది. ఒక‌వేళ ఆ మంట‌ల నుంచి నువ్ ప్రాణాల‌తో బ‌య‌టిప‌డితే నువ్ ఇంటికి రా.. నేనే చంపేస్తా అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అందులో భ‌ర్త‌పై కోపం కంటే కూడా ఆయ‌న చేసిన రిస్క్ కు అత‌డికి ఏమ‌వుతుందో అనే భ‌య‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఆ భ‌యంలోనే ప్రేమ కూడా ఉంది. మొత్తానికి అక్ష‌య్ కుమార్ చేసిన మంట‌ల ఫీట్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు