Home /News /movies /

మీడియాకు ముఖం చూపించలేక కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న స్టార్ హీరో భార్య..

మీడియాకు ముఖం చూపించలేక కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న స్టార్ హీరో భార్య..

ట్వింకిల్ ఖన్నా (Instagram/Photos)

ట్వింకిల్ ఖన్నా (Instagram/Photos)

మీడియాకు ముఖం చూపించలేక కర్చీఫ్ అడ్డుపెట్టుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

    మీడియాకు ముఖం చూపించలేక కర్చీఫ్ అడ్డుపెట్టుకొన్న బాలీవుడ్ స్టార్ హీరో భార్య  వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మీడియాకు కనపడకుండా పేపర్ అడ్డం పెట్టుకోవడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్వింకిల్ ఖన్నా విషయానికొస్తే.. ఈమె సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటోంది. అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన వివరాలతో పాటు సోసైటీ జరుగుతోన్న ఇష్యూలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ట్వింకిల్ ఖన్నా ఒక వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూట్ చేసి తిరిగి వెళుతూ.. మీడియాకు ముఖం చూపించకుండా పేపర్ అడ్డు పెట్టుకొని కారెక్కి వెళ్లిపోయింది. ట్వింకిల్ ఖన్నా.. మీడియాకు ముఖం చూపించనంతగా ఏమి చేసిందో అని అక్కడున్న తలో రకంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత ట్వింకిల్.. మీడియాకు ముఖం కనిపించకుండా పేపర్ అడ్డుపెట్టుకున్న వీడియోను షేర్ చేసింది. నేను అలా ఎందుకు ప్రవర్తించానో తర్వాత మీడియాకు తెలుస్తోంది. అపుడు మీరందరూ షాక్ అవుతారంటూ చెప్పుకొచ్చింది. నేను చేసిన పని ఇపుడు కొత్త పంథాగా మారబోతుందంటూ పేర్కొంది. మొత్తానికి మీడియా వాళ్లు మాత్రం.. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా విజృభిస్తోంది. దాంతో పాటు ట్వింకిల్ ఖన్నాకు ఏమైనా దగ్గు కానీ జలుబు కానీ చేసుంటుంది. అందుకే అలా ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకొని ఉండొచ్చని ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.



    ట్వింకిల్ ఖన్నా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న .. తన భర్త అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న సినిమాలకు సంబంధించిన విషయాలను చూసుకొంటోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akshay Kumar, Bollywood, Hindi Cinema, Sooryavanshi, Twinkle Khanna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు