పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్న అక్షయ్ కుమార్.. ఫ్యాన్స్ పరేషాన్..

పాత్ర డిమాండ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటాడు. ఆయన చేసే పాత్రలే అవి చెప్తాయి. ఒక్కోసారి ఒక్కో పాత్రలో కనిపిస్తూ అభిమానులతో పాటు సాధారణ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2019, 7:12 PM IST
పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్న అక్షయ్ కుమార్.. ఫ్యాన్స్ పరేషాన్..
హౌజ్ ఫుల్ 4 ఏక్ ఛుమ్మా సాంగ్ (Source: Youtube)
  • Share this:
పాత్ర డిమాండ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటాడు. ఆయన చేసే పాత్రలే అవి చెప్తాయి. ఒక్కోసారి ఒక్కో పాత్రలో కనిపిస్తూ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా మాయ చేస్తూనే ఉంటాడు ఖిలాడీ. కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో.. ఆ కారెక్టర్స్ డిమాండ్ చేస్తే ఎంతవరకు తెగించడానికైనా అంతే సిద్ధంగా ఉంటాడు అక్కీ భాయ్. ఇప్పుడు కూడా ఈయన అలాంటి పనే చేసాడు. హీరోలు సాధారణంగా విలన్స్ చేతుల్లో తన్నులు తినడానికి కూడా ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ల ఇమేజ్ అలా పెరిగిపోయింది.
Akshay Kumar touches feet of actress Pooja Hegde in Housefull 4 Ek Chumma video song pk పాత్ర డిమాండ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటాడు. ఆయన చేసే పాత్రలే అవి చెప్తాయి. ఒక్కోసారి ఒక్కో పాత్రలో కనిపిస్తూ అభిమానులతో పాటు సాధారణ.. housefull 4 ek chumma video song,akshay kumar,akshay kumar twitter,akshay kumar pooja hegde,akshay kumar housefull 4,akshay kumar pooja hegde ek chumma song,housefull 4 movie twitter,pooja hegde hot,telugu cinema,bollywood,పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్న అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్,పూజా హెగ్డే,హౌజ్ పుల్ 4,బాలీవుడ్
హౌజ్ ఫుల్ 4 ఏక్ ఛుమ్మా సాంగ్ (Source: Youtube)


అలాంటిది ఇప్పుడు ఏకంగా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో.. హీరోయిన్ కాళ్లు పట్టుకున్నాడు. ఇది చూసి ఫ్యాన్స్‌తో పాటు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పాదాలను ముద్దు పెట్టుకోవడమే కాకుండా తన పెదాలతో తడుముతూ పైకి వచ్చాడు అక్షయ్ కుమార్. తాజాగా హౌజ్ ఫుల్ 4 సినిమాలో నటిస్తున్నాడు అక్కీ భాయ్. ఇందులో పూజా హెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్.

కృతి సనన్, కృతి కర్బందా మరో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఇప్పుడు విడుదలైన ఏక్ చుమ్మా పాటలో పూజా హెగ్డే కాళ్లు పట్టుకున్నాడు అక్షయ్ కుమార్. పాటలో భాగంగానే వచ్చే ఈ స్టెప్ ఇప్పుడు అభిమానులను బాగానే అలరిస్తుంది. కారెక్టర్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే తమ హీరోను చూసి కాలర్ ఎగరేస్తున్నారు అక్షయ్ అభిమానులు. అక్టోబర్ 25న హౌజ్ ఫుల్ 4 విడుదల కానుంది.
First published: September 30, 2019, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading