హోమ్ /వార్తలు /సినిమా /

Akshay Kumar: అక్షయ్, సునీల్ శెట్టి, పరేష్ రావల్‌ల ’హేరా ఫేరీ 3’ షూటింగ్ ప్రారంభం..

Akshay Kumar: అక్షయ్, సునీల్ శెట్టి, పరేష్ రావల్‌ల ’హేరా ఫేరీ 3’ షూటింగ్ ప్రారంభం..

అక్షయ్ కుమార్ ‘హేరా ఫేరీ 3’ షూటింగ్ స్టార్ట్ (File/Photo)

అక్షయ్ కుమార్ ‘హేరా ఫేరీ 3’ షూటింగ్ స్టార్ట్ (File/Photo)

Akshay Kumar - Hera Pheri 3: అక్షయ్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హేరా ఫేరీ’ సినిమా బాలీవుడ్‌లో ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ ఫ్రాంచైజీలో 3వ సినిమా ‘హేరా ఫేరీ 3’ ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Akshay Kumar - Hera Pheri 3: అక్షయ్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హేరా ఫేరీ’ సినిమా బాలీవుడ్‌లో ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అప్పటి వరకు అక్షయ్ కుమార్ అంటే యాక్షన్ అనే ఇమేజ్ ఉండేది. ఈ సినిమాతో ఖిలాడీ ఇమేజ్ కాస్తా కామెడీ హీరోగా టర్న్ అయింది. ఈ సినిమాను హిందీలో ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు. 31 మార్చి 2000లో ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా మలయాళంలో సిద్ధిక్ లాల్ డైరెక్ట్ చేసిన ‘రామ్‌జీ రావు స్పీకింగ్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఆ తర్వాత 2006లో ‘ఫిర్ హేరా ఫేరీ’ సినిమా నీరజ్ వోరా దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి పార్ట్‌లో అక్షయ్ కుమార్ ‘రాజు’ అనే పాత్రలో నటించారు. సునీల్ శెట్టి ‘ఘన్‌శ్యామ్’ పాత్రలో నటించారు. అటు పరేష్ రావల్ బాబురావు గణ‌పత్ రావు ఆప్టేగా నటించారు. ఈ సినిమాలో వీళ్ల నటనను ఎవరు మరిచిపోలేరు.

తాజాగా ఈ సినిమాకు మూడో సీక్వెల్‌కు రంగం సిద్ధం అయింది. ఈ మూడో సీక్వెల్‌కు ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియాద్‌వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబాయిలో ఓ స్టూడియోలో  ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే యేడాది ఈ సినిమా విడుదల కానుంది.

అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ హీరో అక్షయ్  వరుస సినిమాలతో అదరగొడుతున్నారు.  గతేడాది అక్కీ..  ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్‌పుత్లీ, రామ్ సేతు సినిమాలతో పలకరించారు. ఇందులో రామ్ సేతు సినిమా మాత్రమే ఓ మోస్తరు విజయం మాత్రమే సాధించింది. ఈ యేడాది చివర్లలో ‘ఆన్ యాక్షన్ హీరో’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు.  అంతేకాదు తొలిసారి తన సినీ జీవితంలో  ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాలో చారిత్రక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది.  ఆసంగతి పక్కనే పెడితే.. రీసెంట్‌గా  అక్షయ్ కుమార్.. భారతీయుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటిస్తున్నారు.

Akshay kumar Emraan hashmi Selfiee movie Trailer talk Review,Akshay as Selfiee Trailer Talk: అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీ ట్రైలర్ టాక్.. హీరో, ఫ్యాన్ మధ్య సెల్ఫీ వార్..,Selfiee,Selfiee Movie Trailer Talk,Akshay as Chhatrapati Shivaji Maharaj,akshay Vedat Marathe Veer Daudle Saat, akshay kumar as Chhatrapati Shivaji Maharaj, Chhatrapati Shivaji Maharaj akshay kumar,Akshay kumar Movies,akshay kumar,akshay kumar as chatrapati shivaji,akshay kumar as chhatrapati shivaji maharaj,chhatrapati shivaji maharaj akshay kumar,akshay kumar chhatrapati shivaji maharaj,akshay kumar in chhatrapati shivaji maharaj role,akshay kumar shivaji maharaj cinema,akshay kumar marathi movie,akshay kumar in shivaji maharaj role,akshay kumar in marathi cinema,chhatrapati shivaji maharaj,akshay kumar as chatrapati shivaji maharaj,akshay,akshay kumar movies,Tollywood,Bollywood,అక్షయ్ కుమార్,ఛత్రపతి శివాజీ మహారాజు పాత్రలో అక్షయ్ కుమార్,ఛత్రపతి శివాజీ మహారాజ్,వేదాత్ మరాఠీ వీర్ దౌడ్లే,ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో అక్షయ్ కుమార్,సెల్ఫీ మూవీ ట్రైలర్,సెల్ఫీ మూవీ,సెల్ఫీ మూవీ ట్రైలర్ టాక్
అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీ (Twitter/Photo)

ఈ కోవలో అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీతో ఈ వీక్  పలకరించనున్నారు. ఈ సినిమాలో ఎమ్రాన్ హష్మీ మరో ముఖ్యపాత్రలో నటించారు. అక్షయ్ కుమార్‌తో  ‘గుడ్ న్యూస్’ సినిమాను తెరకెక్కించిన రాజ్ మెహతా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇందులో అక్షయ్ కుమార్ ‘విజయ్’ అనే హీరో పాత్రలో నటించారు. అతని అభిమాని పాత్రలో ఎమ్రాన్ హష్మీ నటించారు.

‘సెల్ఫీ’ మూవీ  మలయాళంలో హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ట్రైలర్  విషయానికొస్తే.. ఈ సినిమాను ఒక హీరోతో ఒక ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఓ సెల్పీ ఫోటో దిగాలనుకుంటారు. ఈ సందర్భంగా మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎలాంటి ప్రాబ్టెమ్స్ ఫేస్ చేసారనేది ఈ సినిమా స్టోరీ. మొత్తంగా ఒక హీరో, వెహికల్ ఇన్‌స్పెక్టర్ అహం నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.  మొత్తంగా సూర్యవంశీ తర్వాత సరైన సక్సెస్‌లేని అక్షయ్ కుమార్.. సెల్పీ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో అక్షయ్ కుమార్.. షౌకీన్స్ సినిమాలో హీరో పాత్రలో నటించారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తన నిజ జీవిత పాత్ర యైన ఒక సినిమా కథానాయకుడు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫిబ్రవరిన విడుదల చేస్తున్నారు. మరి ‘సెల్పీ’ మూవీతో ఎమ్రాన్ హష్మీ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Akshay Kumar, Bollywood news, Paresh Rawal, Sunil Shetty

ఉత్తమ కథలు