Akshay Kumar-Laxmmi Bomb : దీపావళికి పేలనున్న అక్షయ్ లక్ష్మీబాంబ్..

Akshay Kumar-Laxmmi Bomb : అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీబాంబ్' త్వరలో ఓటీటీలో విడుదలకానుంది.

news18-telugu
Updated: September 17, 2020, 1:37 PM IST
Akshay Kumar-Laxmmi Bomb : దీపావళికి పేలనున్న అక్షయ్ లక్ష్మీబాంబ్..
అక్షయ్ కుమార్ Photo : Twitter
  • Share this:
కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దెబ్బతో అన్ని రంగాలతో పాటు వినోద రంగం కుదేలైంది. పూర్తైన సినిమాలు విడుదల కాకపోవడం.. షూటింగ్ మధ్యలో వున్న చిత్రాలు ఎక్కడివక్కడ ఆగిపోవడం వల్ల ఆయా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తంగా అన్ని భాషాల్లో కలిపి వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అవ్వడంతో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి మునుపటిలాగా అందిరితో కలిసి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా నాని, సుధీర్ బాబు నటించిన వి ఇటీవల అమెజాన్ లో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అందాలతార కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' కూడా డిజిటల్‌లో విడుదలైన సంగతి తెలిసిందే.


ఈ హవా హిందీలోను కూడా కనపడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ఈద్ సందర్భంగా మే 22న విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా వల్ల అది సాధ్యపడేలా లేదు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్ లో లక్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీబాంబ్' ఓటీటీ హక్కులను హాట్ స్టార్ సంస్థ 125 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. లక్ష్మీ బాంబ్ తెలుగు సినిమా కాంచన‌కు రీమేక్‌గా వస్తోంది. లక్ష్మీ బాంబ్ దీపావళి కానుకగా నవంబరు 9న సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
Published by: Suresh Rachamalla
First published: September 17, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading