Home /News /movies /

AKSHAY KUMAR SOORYAVANSHI MOVIE CROSS 50 CRORE RUPEES IN OVERSEAS MARKET THIS IS NEW RECORD AFTER COVID SECOND WAVE TA

Akshay - Sooryavanshi : అక్షయ్ ‘సూర్యవంశీ’ మరో రికార్డ్.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్స్..

అక్షయ్ ‘సూర్యవంశీ’ మరో రికార్డు (Twitter/Photo)

అక్షయ్ ‘సూర్యవంశీ’ మరో రికార్డు (Twitter/Photo)

Akshay Kumar - Sooryavanshi : బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటంచిన లేటెస్ట్ మూవీ ‘సూర్యవంశీ’ దీపావళి కానుకగా థియేటర్స్‌లో విడుదలైన సంచలన విజయం సాధించి.. బాలీవుడ్ నిర్మాతలకు కొత్త ఊపిరినిచ్చింది. 

    Akshay Kumar - Sooryavanshi : బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటంచిన లేటెస్ట్ మూవీ ‘సూర్యవంశీ’ దీపావళి కానుకగా థియేటర్స్‌లో విడుదలైన సంచలన విజయం సాధించి.. బాలీవుడ్ నిర్మాతలకు కొత్త ఊపిరినిచ్చింది. ఈ యేడాది కరోనా సెకండ్ వేవ్ తర్వాత ‘బెల్ బాటమ్’ సినిమాతో థియేటర్స్‌లో పలకరించారు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ‘బెల్ బాటమ్’  ముంబై సహా పలు ప్రాంతాల్లో థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కానీ సందర్భంలో విడుదలైన ఈ సినిమా కేవలం రూ. 30 కోట్ల వసూళ్లనే సాధించింది. ఇక దీపావళి కానుకగా విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు అక్షయ్ కుమార్. ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇప్పటికే రూ.150 కోట్ల వసూళ్లు చేసిన ఈ సినిమా రూ. 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా కేవలం ఓవర్సీస్‌లో రూ. 53.53 కోట్ల వరకు రాబట్టి మిగతా సినీ నిర్మాతలు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

    మరో రికార్డ్.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓవర్సీస్‌లో ఇది రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అనే చెప్పాలి. మొత్తంగా మూడో వారంలో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘సూర్యవంశీ’ రికార్డుల అరాచకం సృష్టిస్తోంది. కరోనా తర్వాత ఈ స్థాయిలో వస్తున్న వసూళ్లు చూసి బాలీవుడ్ నిర్మాతలతో పాటు దర్శకులు, మిగతా హీరోలు పండగ చేసుకుంటున్నారు.


    కరోనా వైరస్ తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని ఇండస్ట్రీలు కోలుకుంటున్నాయి. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. టాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. కరోనా వైరస్ రెండో దశ అయిన తర్వాత మన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. అయితే ఇతర ఇండస్ట్రీలో మాత్రం ఇది జరగలేదు. ఇప్పటికీ తమిళనాట సూర్య లాంటి స్టార్ హీరోలు తమ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. మొన్నటికి మొన్న జై భీమ్ అలాగే విడుదల చేసారు సూర్య.

    Kaikala Satyanarayana : నటుడిగా కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానంలో కీలక మలుపులు ఇవే..


    బాలీవుడ్‌లోనూ పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. ముఖ్యంగా కరోనా వైరస్ తర్వాత అక్కడ వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే ఒకప్పుడు రెండు రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసే సినిమాలు.. గత రెండేళ్లుగా ఒక్కటి కూడా కనీసం రూ.  50 కోట్లు వసూలు చేయలేనంతగా. కానీ ఇప్పుడు ‘సూర్యవంశీ’తో ఆ పరిస్థితులు మారిపోయాయి.

    Silver Screen Police: సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 1

    ఇలాంటి సమయంలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూర్యవంశీ సినిమా బాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు తీసుకొచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరిసారు. 1993 బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు రోహిత్.

    ’సూర్యవంశీ’లో అక్షయ్ కుమార్,అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ (Twitter/Photo)


    ఎప్పటిలాగే రొటీన్ కథను తీసుకున్నా కూడా తన కమర్షియల్ స్టామినా ఏంటో మరోసారి చూపించాడు ఈ దర్శకుడు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 34 కోట్ల గ్రాస్.. అలాగే రెండో రోజు దాదాపు 32 కోట్ల వరకు వసూలు చేసింది. మూడో రోజు  రూ. 34 కోట్ల వసూలు చేసి 101 కోట్ల గ్రాస్ పూర్తి చేసింది. కీలకమైన 4వ రోజు కూడా రూ.  14 కోట్లకు పైగా వసూలు చేసింది సూర్యవంశీ.

    Silver Screen Police : సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 2

    3 రోజుల్లోనే  100 కోట క్లబ్‌లో చేరిపోయింది సూర్యవంశీ. ఇకపై ధైర్యంగా తమ సినిమాలను విడుదల చేసుకోవచ్చు అంటూ గుండె మీద చేయి వేసుకుని కూర్చుంటున్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అలాగే నైజాం (తెలంగాణ)లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది సూర్యవంశీ. ఈ సినిమాకు తెలంగాణలో  ఇప్పటి వరకు రూ. 10. 5 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. మొత్తంగా ఎలా చూసుకున్నా కూడా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల మోత మోగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు నిర్మాతలు.

    Silver Screen Police: పవన్, మహేష్, ఎన్టీఆర్ సహా ఈ తరంలో సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 3

    తాజాగా అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా రూ. . 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమాను వచ్చే నెల మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను డిజటల్ హక్కులను రూ. 100 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా అక్షయ్ ‘సూర్యవంశీ’ సినిమాతో బాలీవుడ్‌కు మంచి రోజుల వచ్చాయనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akshay Kumar, Bollywood news, Overseas Market, Prithviraj Movie, Sooryavanshi Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు