నిత్యామీనన్ పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్.. తిండిపోతూ అంటూ..

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్మకులు ప్రశంసలు  సొంతం చేసుకుంటోన్న నిత్యామీనన్...తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ మూవీతో  బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తోంది. అందులో భాగంగా  అక్షయ్ కుమార్ నిత్యా మీనన్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు.

news18-telugu
Updated: July 25, 2019, 5:27 PM IST
నిత్యామీనన్ పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్.. తిండిపోతూ అంటూ..
‘మిషన్ మంగళ్’లో అక్షయ్,నిత్యా,తాప్సీ,విద్యాబాలన్ (పైల్ ఫోటో)
  • Share this:
అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్మకులు ప్రశంసలు  సొంతం చేసుకుంటోన్న నిత్యామీనన్...తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ మూవీతో  బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఈ సినిమాలో నిత్యా మీనన్.. వర్షగౌడ అనే శాస్త్రవేత్త పాత్రలో నటించింది. ‘మిషన్ మంగళ్’ కోసం పాటుపడిన శాస్త్రవేత్తల బృందంలో ఆమె ఒకరు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తోంది. అందులో భాగంగా  అక్షయ్ కుమార్ నిత్యా మీనన్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. నిత్యా మీనన్ మంచి నటి అని చెప్పడమే కాదు... వివిధ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు వచ్చిన అవార్డుల గురించి గొప్పగా చెప్పాడు.

akshay kumar shocking comments on Nithya Menen in the promotions of mission mangal movie,akshay kumar,nithya menen,akshay kumar nithya menen,akshay kumar twitter,akshay kumar instagram,nithya menen twitter,nithya menen instagram,akshay kumar shocking comments on nithya menen,mission mangal,mission mangal akshay kumar,nithya menon,akshay kumar mission mangal trailer,akshay kumar movie,akshay kumar mission mangal,mission mangal,vidya balan,sonakshi sinha,nithya menen about akshay kumar,nithya menen fun with akshay kumar,nityamenon trolled by akshay kumar mangal movie nitya menon,mission mangal trailer,taapsee pannu,akshay kumar movies,అక్షయ్ కుమార్,నిత్యామీనన్,అక్షయ్ కుమార్ నిత్యా మీనన్,నిత్యా మీనన్ పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్,మిషన్ మంగళ్ ప్రమోషన్స్,
‘మిషన్ మంగళ్’లో అక్షయ్ కుమార్, నిత్యామీనన్, తదితరులు (ఫైల్ ఫోటో)


అంత వరకు బాగానే ఉన్నా నిత్యా మీనన్ కు భోజనం అంటే ఎంత ఇష్టమో కూడా చెప్పుకొచ్చాడు. తిండి కోసం ఆమె ఎంతగా ఇబ్బంది పెట్టేదో కూడా చెప్పాడు. నిత్యాకు ఏం కావాలో నేరుగా తనకే ఆర్డర్ చేసేదన్నారు. అంతేకాదు తన బతుకు డబ్బావాలా బతుకు చేసిందని అన్నాడు. ‘రేపు నాకు పాలక్ పనీర్ కావాలి... ఇది కావాలి అది కావాలని అడిగేది’ అన్నాడు. నిత్యా ఒక్కరే కాదు... సినిమాలో నటించిన మహిళలంతా అలాగే చేశారని... తనతో బ్రేక్ ఫాస్ట్ కూడా తయారు చేయించేవారని... తనతో ఇలా చేయించేందుకు సిగ్గులేదా అని కూడా అన్నాడు. అక్షయ్ సరదాగా అన్న ఈ మాటలను స్టేజ్ మీది వారే కాదు... చూస్తున్న ఆహుతులు కూడా ఎంజాయ్ చేశారు. అందరూ సరదాగా నవ్వుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 25, 2019, 5:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading