నేను భారతీయుణ్ణి.. నాకు మతం లేదు.. హీరో అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు..

అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)

Akshay kumar | బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. తనకు మతం లేదు.. నేను భారతీయుణ్ణి అంటూ తన సినిమా ‘సూర్యవంశీ’  ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

  • Share this:
    బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. తనకు మతం లేదు.. నేను భారతీయుణ్ణి అంటూ తన సినిమా ‘సూర్యవంశీ’  ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సందర్భంగా ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. తాను మతాన్ని విశ్వసించనని భారతీయత అనేదే తన మతమని చెప్పుకొచ్చాడు. ఇదే అంశంతో తాను సూర్యవంశీ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పాడు. తాను భారతీయుడుగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. మతం గురించి ఆలోచించను. హిందూ, ముస్లిమ్, సిక్కు, పార్సీ, క్రిష్టియన్ ఎవరైనా.. భారతీయత అనే అద్దంలోంచే సమాజాన్ని చూడాలన్నారు. మా ‘సూర్యవంశీ’ చిత్రంలో అదే విషయాన్ని చూపించినట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో యాదృచ్చికంగా మత విద్వేషాలకు సంబంధించిన ఇష్యూస్‌‌ను చర్చించడం జరిగిందన్నారు. ఈ చిత్రం దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేసాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: