Akshay Kumar Raghava Lawrence Laxmmi Bomb Trailer Released | రాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. హిందీలో రాఘవ లారెన్స్‌కు ఇదే ఫస్ట్ మూవీ. అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ఈద్ సందర్భంగా మే 22న విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా వల్ల అది సాధ్యపడేలా లేదు.కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా హాట్ స్టార్‌లో దీపావళి కానుకగా నవంబర్ 9న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ రూ. 125 కోట్లకు ఈ సినిమా ప్రసార హక్కులను కొనుక్కున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.
ఈ ట్రైలర్ హిందీతో పాటు మిగతా భాషలకు సంబంధించిన వాళ్లకు కొత్తగా కనిపించినా.. సౌత్ ప్రేక్షకులు మాత్రం ఆల్రెడీ ఈ సినిమాను చూసిన నేపథ్యంలో కొత్తగా కనిపించదు. ఇక కాంచన సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో శరత్ కుమార్ నటించారు. ఇక హిందీలో మాత్రం అక్షయ్ కుమార్ హీరో పాత్రతో పాటు ట్రాన్స్‌జెండర్‌గా రెండు పాత్రల్లో నటించాడు. ఆయా పాత్రల్లో అక్షయ్ కుమార్ మంచి నటననే కనబరిచాడు.
కామెడీ హార్రర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ మోహిలే ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తనీష్ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్ కుమార్ ఇచ్చిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఐతే.. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి థియేటర్స్ తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాను హాట్‌స్టార్‌తో పాటు థియేటర్స్‌లో కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి. ఇక అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ఈయన హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమా షూటింగ్ రీసెంట్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇక కరోనా తర్వాత ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేసిన స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ రికార్డు క్రియేట్ చేసాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Hotstar, Kiara advani, Raghava Lawrence