Home /News /movies /

Akshay Kumar - Prithviraj Teaser Talk : హిందూస్థాన్ సింహంగా అక్షయ్ కుమార్.. అదిరిన ’పృథ్వీరాజ్’ టీజర్..

Akshay Kumar - Prithviraj Teaser Talk : హిందూస్థాన్ సింహంగా అక్షయ్ కుమార్.. అదిరిన ’పృథ్వీరాజ్’ టీజర్..

అక్షయ్ ‘పృథ్వీరాజ్’టీజర్ విడుదల (Twitter/Photo)

అక్షయ్ ‘పృథ్వీరాజ్’టీజర్ విడుదల (Twitter/Photo)

Akshay Kumar - Prithviraj Teaser Talk : బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ వరుస సినిమాాలతో అదరగొడుతున్నారు. తాజాగా ఈ బాలీవుడ్ ఖిలాడి హిందూస్థాన్ సింహం ‘పృథ్వీరాజ్’ చౌహాన్ పాత్రలో ప్రేక్షకులను పలకరించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    Akshay Kumar - Prithviraj Teaser Talk : బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ వరుస సినిమాాలతో అదరగొడుతున్నారు. ఈ యేడాది కరోనా సెకండ్ వేవ్ తర్వాత ‘బెల్ బాటమ్’ సినిమాతో థియేటర్స్‌లో పలకరించారు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ‘బెల్ బాటమ్’  ముంబై సహా పలు ప్రాంతాల్లో థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కానీ సందర్భంలో విడుదలైన ఈ సినిమా కేవలం రూ. 30 కోట్ల వసూళ్లనే సాధించింది. రీసెంట్‌గా దీపావళి సందర్భంగా విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు అక్షయ్ కుమార్. ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇప్పటికే రూ.150 కోట్ల వసూళ్లు చేసిన ఈ సినిమా రూ. 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా కేవలం ఓవర్సీస్‌లో రూ. 50 కోట్ల వరకు రాబట్టి మిగతా సినీ నిర్మాతలు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

    ఈ సినిమా తర్వాత అక్షయ్ కుమార్.. హిందూస్థాన్ సింహంగా పేరు గాంచిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథపై ‘పృథ్వీరాజ్’ టైటిల్‌తో చారిత్రక సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేసారు.


    ఈ సినిమా టీజర్‌లో ‘హిందూస్థాన్ సింహం వస్తోంది’. సలామ్ చేయడానికీ రెడీగా ఉండండి అంటూ టీజర్ మొదలైంది. ధర్మం కోసం బతికాను. ధర్మం కోసం చావనైనా చస్తాను అంటూ పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగులు బాగున్నాయి.  హిందూ ధర్మ స్థాపన కోసం పృథ్వీరాజ్ చేసిన పోరాటం ఈ సినిమాలో హైలెట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో సంజయ్ దత్, సోనూసూద్ నటించారు. మరోవైపు  ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడిగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కథానాయికగా ఈ సినిమాతో పరిచయమవుతోంది. ఈ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో నటించింది. ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 21న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నారు.

    NTR Jr@21 Years in TFI : హీరోగా 21 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నఎన్టీఆర్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు..


    మరోవైపు అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ నేపథ్యంలో చారిత్రక నేపథ్యంలో  తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. దాంతో పాటు ‘రక్షా బంధన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో పాటు ’బచ్చన్ పాండే, ’ఐతరంగీ రే’తో సినిమా షూటింగ్స్ దాదాపు పూర్తి కావొచ్చాయి. రీసెంట్‌గా ‘ఓ మై గాడ్ 2’  సినిమాఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మహా కాళేశ్వరుడి పాత్రలో కనిపించనున్నారు.

    ఒకే రూట్లో వెళుతున్న బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్..

    దీంతో పాటు ‘ఆకాశం నీ హద్దురా’, ‘రాక్షసుడు’, ఊసరవెల్లి’, డ్రైవింగ్ లైసెన్స్ వంటి రీమేక్స్‌లో నటించడానికి ఓకే చెప్పారు అక్షయ్ కుమార్. దాంతో పాటు 1971 యుద్ద నేపథ్యంలో ‘గూర్క’ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. గూర్కా రెజిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్కీ గూర్కా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akshay Kumar, Bollywood news, Manushi Chhillar, Prithviraj Movie, Sanjay Dutt, Sonusood, Sooryavanshi Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు