HouseFull 4:అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్.. టోటల్ కన్ఫ్యూజన్..

హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో  బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్4’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్..

news18-telugu
Updated: September 27, 2019, 3:03 PM IST
HouseFull 4:అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్.. టోటల్ కన్ఫ్యూజన్..
అక్షయ్ కుమార్ హౌస్‌ఫుల్ 4 (Twitter/Photo)
  • Share this:
హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో  బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్4’. ఈ సినిమాలో పూజా హెగ్డే,కృతి సనన్, కృతి కర్బాందా హీరోయిన్ పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. ఇప్పటి వరకు హౌస్‌ఫుల్ సిరీస్‌లో వచ్చిన కామెడీ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ 600 ఏళ్ల క్రితం నాటి బాలా దేవ్ సింగ్  పాత్రలో నటించడు. ఈ పాత్ర గుండుతో ఉండటం విశేషం. మరోవైపు 2019కి లండన్‌కు చెందిన హ్యారీ పాత్రలో నటించాడు. రెండు విభిన్న పాత్రల్లో అక్షయ్ నటన బాగుంది.మొత్తంగా 600 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీకి ఇప్పటికీ లింక్ పెడుతూ.. ఒక రాజ్ మహల్ చుట్టు అలుకున్నకథగా ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాను తెరెక్కించాడు దర్శకుడు ఫర్హాద్ సామ్జీ. రాజ నర్తకుడు బంగ్‌డు మహారాజ్ పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్, రాజకుమారి మాల పాతర్లో పూజా హెగ్డే..రాజకుమారి మధుగా కృతి, రాజ్ కుమార్ మీనాగా కృతి కర్బందా.. అంగరక్షక్ ధర్మపుత్రగా బాబీ డియోల్ యాక్ట్ చేసారు.

హౌస్‌ఫుల్ 4 మూవీ (Twitter/Photo)


పూర్వ జన్మలో ఒకళ్లను పెళ్లి చేసుకున్న వీళ్లు.. మరు జన్మలో ఇంకోళ్లను పెళ్లి చేసుకుంటారు. ఈ సందర్భంగా వాళ్లకు పూర్వ జన్మ గుర్తుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పడిన కామెడీతో ఈ సినిమాను ఫన్ అండ్ మస్తీగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రానా కీలక పాత్రలో నటించాడు.
First published: September 27, 2019, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading