ఆ జాబితాలో మన హీరోలనే కాదు.. జాకీచాన్‌ను బీట్ చేసిన అక్షయ్ కుమార్..

ప్రతి యేడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు.

news18-telugu
Updated: July 11, 2019, 7:34 PM IST
ఆ జాబితాలో మన హీరోలనే కాదు.. జాకీచాన్‌ను బీట్ చేసిన అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్,జాకీచాన్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
ప్రతి యేడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలిస్తే.. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ 35వ స్థానంలో నిలిచాడు.యేడాదికి ఈజీగా మూడు నుంచి నాలుగు సినిమాలు చేసే అక్షయ్ కుమార్..ఒక్కో సినిమాకు కనీసం రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరోవైపు లాభాల్లో వాటా అదనం. దీనితో పాటు కమర్షియల్ యాడ్స్ ‌తో ఇంకో చేత్తో ఈజీగా సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ అభివర్ణించింది. అక్కీ..దాదాపు 20పైగా బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉన్నారు.   రకంగా యేడాదికి నికరంగా రూ.444 కోట్లు సంపాదిస్తూ బాలీవుడ్ ఎర్నింగ్ స్టార్‌ అని ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ యేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కేసరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరోవైపు అక్కీ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇంకోవైపు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’,గుడ్ న్యూస్’, ‘లక్ష్మీ బాంబ్’, ‘సూర్య వంశీ’ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ జాబితాలో అక్షయ్ కుమార్.. జాకీచాన్‌ను మించి పోయాడు.First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...