మరోసారి సంపాదనలో మన దేశంలోనే టాప్ యాక్టర్‌గా అక్షయ్ కుమార్..

ప్రతి యేడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే వరుసగా రెండోసారి చోటు దక్కించుకున్నాడు.

news18-telugu
Updated: June 5, 2020, 1:59 PM IST
మరోసారి సంపాదనలో మన దేశంలోనే టాప్ యాక్టర్‌గా అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)
  • Share this:
ప్రతి యేడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. గతేడాది కూడా ఇతను ఈ జాబితాలో  ఉండటం గమనార్హం.  జూన్ 2019 నుంచి మే 2020 వరకు దాదాపు రూ. 366 కోట్ల సంపాదనతో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ వాల్డ్ వైడ్‌గా ఎక్కువ సంపాదిస్తున్న టాప్ 100 సెలబ్రిటీ జాబితాలో చేరారు. ఈ లిస్టులో కాస్మెటిక్స్ రారాణి కైలీ జెన్నర్ రూ. 4443 కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలోఅక్షయ్ కుమార్ 52వ స్థానంలో నిలిచారు. గతేడాది అక్షయ్ కుమార్ 33వ స్థానంలో నిలిచారు. 2019 ఈ జాబితాలో అక్షయ్ కుమార్ 19 స్థానాలు కోల్పోయిన టాప్ 100లో  నిలవడం గమనార్హం.

akshay kumar ajay devgn ranveer singh rohit shetty suryavanshi trailer released.,akshay kumar Sooryavanshi trailer,akshay kumar,ajay devgn ranveer singh sooryavanshi,rrr,rrr ajay devgn,rohit shetty,ranveer singh,sooryavanshi,akshay kumar,rohit shetty,suryavanshi,akshay kumar rohit shetty,akshay kumar,akshay kumar donates rs 1 crore for phani cyclone victims,akshay kumar twitter,akshay kumar instagram,suryavanshi akshay kumar,akshay kumar suryavanshi,sooryavanshi akshay kumar,sooryavanshi,veer suryavanshi,akshay kumar veer sooryavanshi,akshay kumar upcoming movies,sooryavanshi movie,akshay kumar movies,sooryavanshi teaser,sooryavanshi trailer,askhay kumar meet rohit shetty for suryavanshi movie,rohit shetty interview,veer sooryavanshi,karan johar rohit shetty ajay devgn ranveer singh akshay kumar,simmba,singam,bollywood,jabardasth comedy show,rashmi gautam,అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ సూర్యవంశీ స్టార్ట్,రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్,కరణ్ జోహార్,అక్షయ్ అజయ్ దేవ్‌గణ్ రణ్‌వీర్ సింగ్ రోహిత్ శెట్టి,సింబా,సింగం సిరీస్,ఆర్ఆర్ఆర్ అజయ్ దేవ్‌గణ్,సూర్యవంశీ ట్రైలర్
అక్షయ్,అజయ్,రణ్‌వీర్ సింగ్ ‘సూర్యవంశీ’ (Youtube/Credit)


యేడాదికి ఈజీగా మూడు నుంచి నాలుగు సినిమాలు చేసే అక్షయ్ కుమార్..ఒక్కో సినిమాకు కనీసం రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరోవైపు లాభాల్లో వాటా అదనం. దీనితో పాటు కమర్షియల్ యాడ్స్ ‌తో ఇంకో చేత్తో ఈజీగా సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్ అభివర్ణించింది. ముఖ్యంగా గతేడాది రూ. 490 కోట్ల సంపాదన ఆర్జించిన బాలీవుడ్ సూపర్ స్టార్.. ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం పడిందని ఫోర్బ్స్ వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్‌తో అక్షయ్ కుమార్ డిజిటల్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈ యేడాది అక్షయ్ కుమార్ టాప్‌లో నిలవడానికి కారణంగా నిలించిందని ఫోర్బ్స్ పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌తో ఏకంగా రూ. 75 కోట్ల వరకు డీల్ కుదరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ యేడాది అక్షయ్ కుమార్ .. నటించిన ‘సూర్యవంశీ’ సినిమా కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. మరోవైపు కోవిడ్ 19 కారణంగా ‘లక్ష్మీ బాంబ్’ సినిమా డిజిటల్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం అయింది. మరోవైపు అక్షయ్ కుమార్ బెల్ బాటమ్, బచ్చన్ పాండే సినిమాలగాను ఇప్పటికే రూ. 100 కోట్ల వరకు పారితోషకం అందుకున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది.

Akshay Kumar Only Bollywood Star on Forbes List of Worlds Highest paid Celebrities list,akshay kumar,akshay kumar forbes,akshay kumar news,akshay kumar Forbes,akshay kumar Forbes 52 place,akshay kumar Forbes list,akshay kumar Forbes only indian actor,Jackie Chan,Jackie Chan akshay kumar,akshay kumar movies,akshay kumar forbes list,akshay,akshay kumar latest,akshay kumar income,salman khan,akshay in forbes list,akshay kumar highest paid actor,forbes,shahrukh khan,salman khan forbes,akshay kumar forbes 2017,akshay kumar movie,forbes list,akshay kumar forbes list 2018,akshay forbes,akshay kumar fans,akshay kumar net worth,akshay in forbes,forbes,bollywood,hindi cinema,అక్షయ్ కుమార్,జాకీచాన్,జాకీచాన్ అక్షయ్ కుమార్,ఇండియాలో అత్యంత ధనవంతుడు,హీరోల్లో ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అక్షయ్ కుమార్,ఫోర్బ్స్ జాబితాలో 52వ స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్,52 స్థానంలో అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్


మరోవైపు పోర్బ్స్ టాప్ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీ జాబితాలో వరుసగా కైలీ జెన్నర్, కన్యే వెస్ట్, రోజర్ ఫెదరర్, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్ మెస్పీ, టేలర్ పెర్రీ, నేమార్, హోవర్డ్ స్టెమ్,లెబ్రాన్ జేమ్స్, డ్వానే జాన్సన్‌లు చోటు సంపాదించారు. ఇక అక్షయ్ కుమార్.. కోవిడ్ -19 సహాయక చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు, ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్, ముంబాయి పోలీసులకు రూ. 5 కోట్ల వరకు  మొత్తంగా రూ. 30 కోట్ల వరకు విరాళం అందజేసిన సంగతి  తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 5, 2020, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading