Akshay Kumar : అత్యధిక సంపన్న నటుల జాబితాలో మరోసారి అక్షయ్ కుమార్...

అక్షయ్ కుమార్ Photo : Twitter

Akshay Kumar : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న మొదటి పది మంది సెలబ్రిటీల జాబితాను 2020 సంవత్సరానికి గాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది.

  • Share this:
    హిందీ సూపర్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రపంచంలో అత్యధిక సంపన్న నటుల జాబితాలో మరోసారి చేరాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న మొదటి పది మంది సెలబ్రిటీల జాబితాను 2020 సంవత్సరానికి గాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఒకే ఒక్క నటుడు అక్షయ్‌. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ఆ లిస్ట్‌లో అక్షయ్‌ 48.5 మిలియన్‌ డాలర్ల (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.363 కోట్లు) ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచాడు. కాగా అక్షయ్‌ గతేడాది నాలుగో స్థానంలో నిలవగా.. ఈ ఏడాది రెండు స్థానాలు కిందకు దిగి ఆరోస్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో హాలీవుడ్‌ యాక్టర్ డ్వేన్‌ జాన్సన్‌ 87.5 మిలియన్‌ డాలర్లతో తొలి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అంతేకాదు గతేడాది కూడా ఆయనది మొదటిస్థానమే. ఇక డెడ్‌పూల్‌ స్టార్‌ ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ల డాలర్లతో రెండో స్థానాన్ని ఆక్రమించారు. హాలీవుడ్ నటులు మార్క్‌ వాల్బర్గ్‌, బెన్ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.

    ఇక అక్షయ్‌ కుమార్‌ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ ‘ది ఎండ్‌’ లో నటిస్తున్నాడు. అయితే ఈ షో‌లో అక్షయ్‌ కుమార్‌ నటిస్తునందకు ఆయనకు పది మిలియన్‌ డాలర్లను అమెజాన్ ప్రైమ్ వీడియో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమంటే.. అక్షయ్‌‌కు సినిమాల కంటే కూడా ప్రకటనల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇక అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘లక్ష్మీబాంబ్‌’, సూర్య వన్షీ ‘బెల్ బాటమ్’,‘బచ్చన్‌ పాండే’,‘పృథ్వీరాజ్‌’ సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగు సినిమా కాంచనకు రీమేక్‌గా వస్తోన్న లక్ష్మీబాంబ్‌ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా విడుదలకాలేక పోయింది. దీంతో ఆ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకుడు.
    Published by:Suresh Rachamalla
    First published: