రూ.200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’ మూవీ..

ఈ  యేడాది చివర్లో ‘గుడ్ న్యూస్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమాతో అక్షయ్ కుమార్ మరో మరో సక్సెస్ అందుకున్నాడు. ‘గుడ్‌న్యూస్’ విడుదలైన మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన తాజాగా.. ఈ చిత్రం వారం రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్బులో ఎంటరైంది.

news18-telugu
Updated: January 4, 2020, 5:26 PM IST
రూ.200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’ మూవీ..
‘గుడ్‌‌న్యూస్’ కలెక్షన్స్.. (Twitter/Photo)
  • Share this:
గతేడాది వరుసగా నాలుగు సినిమాలతో పలకరించాడు. ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’, ‘హౌస్‌పుల్4 సినిమాలతో అలరించిన అక్షయ్ కుమార్..ఈ  యేడాది చివర్లో ‘గుడ్ న్యూస్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమాతో అక్షయ్ కుమార్ మరో మరో సక్సెస్ అందుకున్నాడు. ‘గుడ్‌న్యూస్’ విడుదలైన మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన తాజాగా.. ఈ చిత్రం వారం రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్బులో ఎంటరైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రూ. 161.90 కోట్లు, విదేశాల్లో రూ.45.86 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.207.76 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్  చేసారు. రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కృత్రిమ గర్భధారణ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సందర్భంగా రెండు ఫ్యామిలీ మధ్య ఏర్పడిని గందరగోళం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఇయర్ కూడా అక్షయ్ కుమార్.. వరస సినిమాలతో దండయాత్ర చేస్తున్నాడు అక్షయ్ కుమార్. 2020లో కూడా నాలుగు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు ఖిలాడీ. కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్‌.. రోహిత్ శెట్టి సూర్వ వంశీ.. పృథ్వీరాజ్ చిత్రాలతో పాటు మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు