Mission Mangal: చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’.. మొదటి రోజే..

ప్రస్తుతం బాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలతో వరుసగా సక్సెస్‌లు అందుకుంటున్నాడు హీరో అక్షయ్ కుమార్. తాజాగా ఈ కథానాయకుడు జగన్ శక్తి  దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ చిత్రంతో మరో హిట్టును ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 16, 2019, 3:03 PM IST
Mission Mangal: చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’.. మొదటి రోజే..
‘మిషన్ మంగళ్’ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 16, 2019, 3:03 PM IST
ప్రస్తుతం బాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలతో వరుసగా సక్సెస్‌లు అందుకుంటున్నాడు హీరో అక్షయ్ కుమార్. తాజాగా ఈ కథానాయకుడు జగన్ శక్తి  దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ చిత్రంతో మరో హిట్టును ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రూ.29.16 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అంతేకాదు అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే అత్యధిక ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ‘మిషన్ మంగళ్’ రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన అన్ని చోట్ల ‘మిషన్ మంగళ్’ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. రెండో రోజు‌తో పాటు శని, ఆదివారాల్లో ఈ సినిమా రూ.100 కోట్లను క్రాస్ చేసే అవకాశం ఉంది.


గత నాలుగు సంవత్సరాల నుంచి అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు ఆగష్టు 15 కానుకగా విడుదలవుతున్నాయి. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’ మూవీ రూ.25.15 కోట్లు వసూలు చేస్తే.. ‘టాయిలెట్..ఏక్ ప్రేమ్ కథ’ మాత్రం రూ.13.10 కోట్లను వసూలు చేసింది. అంతకు ముందు 2016లో విడుదలైన ‘రుస్తుం’ సినిమా రూ.14.11 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అనేది అక్షయ్ కుమార్‌కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...