'కాశ్మీర్' హీరో బయోపిక్‌లో అక్షయ్ కుమార్ ?

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు అక్షయ్ కుమార్ ఓకే చెప్పాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: August 6, 2019, 1:34 PM IST
'కాశ్మీర్' హీరో బయోపిక్‌లో అక్షయ్ కుమార్ ?
అక్షయ్ కుమార్
  • Share this:
జెట్ స్పీడ్‌తో తన సినిమాలు పూర్తి చేసే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్... తాజాగా మరో బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చే అక్షయ్ కుమార్... త్వరలోనే మిషన్ మంగళయాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు అక్షయ్ కుమార్ ఓకే చెప్పాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన అజిత్ దోవల్... సర్జికల్ స్ట్రైక్స్ సహా దేశ భద్రతకు సంబంధించి అనేక అంశాల్లో కీలకంగా వ్యవహరించారనే టాక్ ఉంది. జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే దేశ భద్రతకు సంబంధించిన అనేక విభాగాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు అజిత్ దోవల్. ఈ క్రమంలో ఆయనకు సైనిక విభాగంలో అత్యున్నత పురస్కారమైన కీర్తీ చక్ర అవార్డు కూడా దక్కింది.

Akshay kumar as ajit doval,akshay kumar in ajit doval biopic,akshay kumar to play ajit doval role,surgicial strikes,artice 370 provoke,jammu and kashmir bifurfication,అజిత్ దోవల్‌గా అక్షయ్ కుమార్,అజిత్ దోవల్ బయోపిక్‌లో అక్షయ్ కుమార్
అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు


తాజాగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి తీసుకున్న అర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నిర్ణయాల అమలులోనూ ఆయన కీలక భూమిక పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ బయోపిక్‌లో నటించేందుకు అక్షయ్ కుమార్ సుముఖత వ్యక్తం చేశారని... గతంలో అక్షయ్ హీరోగా స్పెషల్ 26, టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ సినిమాను రూపొందించిన నీరజ్ పాండే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బాలీవుడ్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ బయోపిక్ సంగతి పక్కపెడితే... మిషన్ మంగళయాన్ తరువాత హౌస్‌ఫుల్ 4,గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీబాంబ్, బచ్చన్ పాండే, ఇక్కా అనే సినిమాలు అక్షయ్ పైప్‌లైన్‌లో ఉన్నాయి.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు