Akshay Kumar Bachchan Pandey: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ యేడాదికి ఈజీగా నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసే బడా స్టార్. ఒక వేళ కరోనా లేకపోయి ఉంటే.. ఓ నాలుగు సినిమాలు 2020లో విడుదలై ఉండేవి. గతేడాది అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే.. ఈ సినిమాను మార్చి నెలాఖరులో థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో విడుదల అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తంగా బాలీవుడ్లో ఖాన్ త్రయానికి పోటీ ఇస్తున్న హీరోల్లో అక్షయ్ ఒకరు. ఆ సంగతి పక్కన పెడితే.. అక్షయ్ కుమార్.. ‘బెల్ బాటమ్’ అనే సినిమాను షూటింగ్ కంప్లీట్ చేసాడు. కరోనా తర్వాత షూటింగ్ మొదలై.. పూర్తి చేసుకున్న బాలీవుడ్లో అతిపెద్ద హీరో ప్రాజెక్ట్ ‘బెల్ బాటమ్’ సినిమానే. దీంతో పాటు అక్షయ్ కుమార్.. హీరో ధనుశ్‌తో కలిసి ‘అతరంగీ రే’ సినిమాను స్టార్ట్ చేసాడు.
ఆ సినిమాతో పాటు ఎపుడో అనౌన్స్ చేసిన ‘బచ్చన్ పాండే’ సినిమా షూటింగ్‌ను కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరోసారి గ్యాంగ్ స్టర్ బచ్చన్ పాండే పాత్రలో నటిస్తున్నాడు. నిర్మాత సాజిత్ నడియావాలాతో హీరో అక్షయ్ కుమార్ కు ఇది 10వ సినిమా. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

’బచ్చన్ పాండే’గా అక్షయ్ కుమార్ (Twitter/Photo)
మరో ముఖ్యపాత్రలో అర్షద్ వార్సీ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. అక్షయ్ కుమార్. ఈ సినిమాను వచ్చే యేడాది 2022 జవనరి 22న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు అక్కీ.తాజాగా ప్రకటించిన పోస్టర్లో పిల్లి కన్నుతో కాస్త క్రూరంగా కనిపిస్తున్నాడు.
మరోవైపు అక్షయ్ కుమార్.. భారతీయ చారిత్రక యోధుడు ‘పృథ్వీరాజ్ చౌహాన్’ జీవిత చరిత్రపై ‘పృథ్వీరాజ్’ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు రామ్ సేతు అనే సినిమా చేస్తున్నాడు. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 23, 2021, 12:24 IST