అక్షయ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న ఖిలాడీ..

అక్షయ్ కుమార్ (Twitter/Photo)

  • Share this:
    అక్షయ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన మళ్లీ తండ్రి కాబోతున్నాడు. ఆయన తండ్రి అవుతోంది రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్ లో. ప్రస్తుతం ఆయన రాజ్ మెహతా దర్శకత్వంలో ‘గుడ్ న్యూస్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఇందులో అక్షయ్ కుమార్.. వరుణ్ బాత్రా అనే క్యారెక్టర్ చేసాడు. అతని భార్యతగా దీప్తి బాత్రాగా కరీనా కపూర్ యాక్ట్ చేసింది. వీళ్లిద్దరు పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో వెళ్లి డాక్టర్‌ను కలుస్తారు. ఆ డాక్టర్ ఐవీఎప్ పద్దతి ద్వారా పిల్లలను కనొచ్చని సలహా చెబుతారు. దీనికి ఈ జంట ఒప్పుకుంటారు. అదే సమయంలో  హనీ బాత్రా, మోనికా బాత్రా  పేర్లతో ఉన్న మరో  జంట ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని అదే హాస్పటిల్‌కు వస్తారు. ఈ  పాత్రల్లో దిల్జీత్ దోసాంజే, కియారా అద్వానీ నటించారు. ఐతే.. ఈ రెండు జంటల పేర్ల వెనక బాత్రా అని  కామన్‌గా ఉండటంతో డాక్టర్లు.. వీరిద్దరి నుంచి సేకరించిన  వీర్యాన్ని ఒకరికి బదులు మరొకరి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను డిసెంబర్ 27న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్‌తో కలిసి అపూర్వ మెహతా, హీర్ జోహార్, శశాంక్ ఖైతాన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published: