Home /News /movies /

AKSHAY KUMAR KANCHANA MOVIE REMAKE LAXMII BOMB MOVIE OPENS WITH NEGATIVE RESPONSE IN OTT PK

Akshay Kumar Laxmii movie: పేలని ‘లక్ష్మీ బాంబ్’.. అక్షయ్ కుమార్‌కు సూపర్ షాక్..

‘లక్ష్మీ బాంబ్’లో అక్షయ్ కుమార్ (Twitter/Photo)

‘లక్ష్మీ బాంబ్’లో అక్షయ్ కుమార్ (Twitter/Photo)

Akshay Kumar Laxmii: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీ దివాళీ కానుకగా హాట్ స్టార్ డిస్నీలో నవంబర్ 9న విడుదలైంది. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఈ సినిమాను నేరుగా ఆన్‌లైన్ రిలీజ్ చేసారు. దాంతో అక్షయ్ ఫ్యాన్స్..

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీ దివాళీ కానుకగా హాట్ స్టార్ డిస్నీలో నవంబర్ 9న విడుదలైంది. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఈ సినిమాను నేరుగా ఆన్‌లైన్ రిలీజ్ చేసారు. దాంతో అక్షయ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దానికితోడు చాలా రోజుల నుంచి భారీ సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న అభిమానులు కూడా లక్ష్మీ ఆ లోటు తీర్చింది. సినిమాలు లేని లోటు మాత్రమే తీర్చింది కానీ అసలైన కిక్ మాత్రం ఇవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. లక్ష్మీ సినిమా ఊహించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. 2011లో వచ్చిన కాంచన సినిమాకు రీమేక్ ఇది. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించాడు ఈ చిత్రంలో. అప్పుడు తెలుగు, తమిళంలో సంచలన విజయం సాధించింది కాంచన. ఇదే సినిమాను హిందీలో లక్ష్మీగా రీమేక్ చేసాడు లారెన్స్. అక్కడ ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగా వస్తుందని నమ్మకంగా కనిపించాడు లారెన్స్. కానీ ఇప్పుడు విడుదలైన తర్వాత చూస్తుంటే మాత్రం పరిస్థితులు తారుమారు అవుతున్నాయి.
akshay kumar laxmmi bomb movie review,laxmii movie review,laxmmi bomb review,laxmi bomb review,laxmmi bomb public review,laxmi bomb movie review,laxmii bomb movie review,laxmmi bomb full movie review,laxmmi bomb movie review hindi,అక్షయ్ కుమార్,లక్ష్మీ బాంబ్ రివ్యూ,అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ రివ్యూ
‘లక్ష్మీ బాంబ్’లో అక్షయ్ కుమార్ (Twitter/Photo)

ఎందుకంటే ఆన్‌లైన్‌లో కూడా సినిమాను చూడ్డానికి ఆసక్తి చూపించడం లేదు ఆడియన్స్. సినిమాలో కొత్తదనం లేదని.. పైగా సౌత్‌లో వర్కవుట్ అయిన కామెడీ అక్కడ వర్కవుట్ కాలేదంటున్నారు. అక్షయ్ కుమార్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్స్ ఏం లేకపోవడం కూడా లక్ష్మీకి మైనస్ అవుతుంది. ఇక్కడ శరత్ కుమార్ పోషించిన హిజ్రా పాత్రను హిందీలో శరద్ కేల్కర్ పోషించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ ఈయన. శరద్ పాత్రకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. అయితే సెంటిమెంట్ చూసుకున్నా.. ఎమోషన్ చూసుకున్నా కూడా కాంచన చాలా బెటర్‌గా ఉందని.. లక్ష్మిలో మాత్రం అవన్నీ వర్కవుట్ కాలేదంటున్నారు.
akshay kumar laxmmi bomb movie review,laxmii movie review,laxmmi bomb review,laxmi bomb review,laxmmi bomb public review,laxmi bomb movie review,laxmii bomb movie review,laxmmi bomb full movie review,laxmmi bomb movie review hindi,అక్షయ్ కుమార్,లక్ష్మీ బాంబ్ రివ్యూ,అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ రివ్యూ
‘లక్ష్మీ బాంబ్’లో అక్షయ్ కుమార్ (Twitter/Photo)

దాంతో హాట్ స్టార్ డిస్నీ నిర్వాహకులకు టెన్షన్ మొదలైంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఎందుకంటే ఇప్పటికే ఈ సీజన్‌లో వాళ్లు తీసుకున్న సడక్ 2 డిజాస్టర్ అయింది. దాంతో పాటు లూట్ కేస్ లాంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఒక్క సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిల్ బెచారా మాత్రమే హిట్ అయింది. భారీ అంచనాలు.. ఆశలతో లక్ష్మీ సినిమాను దాదాపు 140 కోట్లకు తీసుకుంది హాట్ స్టార్. ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న టాక్ చూస్తుంటే వాళ్లకు వణుకు తప్పడం లేదు. మరి ఈ టాక్‌తో అక్షయ్ కుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akshay Kumar, Bollywood, Hindi Cinema, Laxmmi Bomb

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు