Akshay Kumar: బాలీవుడ్ హీరో అక్షయ్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. గతేడాది అక్కీ.. ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్‌పుత్లీ, రామ్ సేతు సినిమాలతో పలకరించారు. ఇందులో రామ్ సేతు సినిమా మాత్రమే ఓ మోస్తరు విజయం మాత్రమే సాధించింది. ఈ యేడాది చివర్లలో ‘ఆన్ యాక్షన్ హీరో’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అంతేకాదు తొలిసారి తన సినీ జీవితంలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాలో చారిత్రక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈయన ‘సెల్ఫీ’ మూవీతో పలకించాడు. ఈ శుక్రవారమే థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నిజ జీవిత పాత్ర అయిన కథానాయకుడు పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ అక్షయ్ అభిమాని పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన కెనడా పౌరసత్వంపై స్పందించారు.
ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అన్ని ఇచ్చిన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. అసలు కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ సందర్భంగా వెల్లడించారు. అసలు ఈ విషయాలు తెలియకుండా తనను కొందరు విమర్శలు చేస్తుంటారని చెప్పుకొచ్చారు.
అక్షయ్ కుమార్ 2017లో ‘టాయిలెట్ .. ఏక్ ప్రేమ్‌కథ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తనకు కెనడా పౌరసత్వం ఉన్న విషయాన్ని బయటపెట్డాడు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఈయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. భారతీయ పౌరసత్వం ఇక్కడ ఓటు హక్కు లేని ఓ వ్యక్తి మన దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించాలని కోరడం అప్పట్లో కొంత మంది అక్షయ్‌పై విమర్శల దాడి చేసారు. ఈ విషయమై అక్షయ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఇక్కడ గత కొన్నేళ్లుగా మన దేశంలోనే పన్నులు చెల్లిస్తున్న విషయాన్ని వెల్లడించారు.
ఇక పౌరసత్వంపై మాట్లాడుతూ.. తాజాగా తాను కెనడా సిటిజన్ షిప్‌ను ఒదలుకోబోతున్నట్టు ప్రకటించారు. భారత దేశం తనకు స్టార్‌డమ్‌తో పాటు అన్ని ఇచ్చింది. ఇక్కడ తాను అనుభవిస్తున్నదంతా ఈ దేశం తనకు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక నా మాతృభూమికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. మన దేశంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేశాను. అది రాగానే కెనడా పౌరసత్వాన్ని ఒదలుకుంటానన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో ఎందుకు కెనడా పౌరసత్వం స్వీకరించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.
90వ దశకం చివర్లో తను యాక్ట్ చేసిన 15 సినిమాలు వరస పరాజయాలు ఎదురయ్యాయి. కెనడాలో ఉన్న ఫ్రెండ్ ఇచ్చిన సలహా కారణంగా సినిమాలు మానేసి కెనడా వెళ్లి పని చేయాలనుకున్నాను. ఆ నిర్ణయం వల్ల ఆ దేశ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేశారు. అలా కెనడా పాస్‌పోర్ట్ రావడంతో .. భారతీయ పౌరసత్వం ఒదులుకోవాల్సి వచ్చిందన్నారు. మన దగ్గర రెండు పౌరసత్వాలు లేవు కనగా .. అనుకోని పరిస్థితుల వల్ల ఈ పని చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత తనకు తన సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఆ తర్వాత ఫుల్ బిజీ అయ్యాను. ఆ తర్వాత కెనడా పౌరసత్వం విషయాన్ని మరిచిపోయాను. అందుకే ఇపుడు మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాను. అంతేకాదు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటానన్నారు. అక్షయ్ విషయానికొస్తే.. మన దేశంలో కోవిడ్ సమయంలో కానీ.. ఇతరత్రా ప్రమాదాలు సంభవించినపుడు కానీ.. ఆర్మీకి సాయం చేయడంలో ఎపుడు ముందుంటారనే విషయం తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood news, Canada