చిరంజీవి అమ్మడు కుమ్ముడు పాటకు స్టెప్పులేసిన అక్షయ్ కుమార్..

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనేది తెలుగు వాళ్లకు ఎంత పరిచయం అయిన పాటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 నుంచి 60 వరకు అందరితోనూ స్టెప్పులేయించాడు మెగాస్టార్ చిరంజీవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 10:27 PM IST
చిరంజీవి అమ్మడు కుమ్ముడు పాటకు స్టెప్పులేసిన అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్ చిరంజీవి ఫైల్ ఫోటోస్
  • Share this:
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనేది తెలుగు వాళ్లకు ఎంత పరిచయం అయిన పాటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 నుంచి 60 వరకు అందరితోనూ స్టెప్పులేయించాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150లోని ఈ పాట ఆల్ టైమ్ ఛార్ట్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇదే పాటకు అక్షయ్ కుమార్ స్టెప్పులు వేసాడు. ఇక్కడే చిన్న మెలిక ఉంది. అక్కీ భాయ్ డాన్సులు వేసింది అమ్మడు కుమ్ముడు సాంగ్‌కు కాదు.. అదే బీట్‌కు. ఈ మధ్య పాటలు హిందీ నుంచి తెలుగు.. తెలుగు నుంచి హిందీకి బాగానే రీమిక్స్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు అమ్మడు కుమ్ముడు పాటను కూడా అక్కడి వాళ్లు తీసుకున్నారు.

తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న హౌజ్ ఫుల్ 4లో భూత్ ఆజా పాట కోసం అమ్మడు కుమ్ముడు ట్యూన్ వాడుకున్నారు. ఇదే పాటలో పూజా హెగ్డే, కృతి సనన్, కృతి కర్బందాతో పాటు రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ కూడా ఉన్నారు. నవాజుద్దిన్ సిద్ధిఖీ ఈ పాటకు హైలైట్. సేమ్ ట్యూన్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ పాటతో ఇట్టే కనెక్ట్ అయిపోతున్నారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది ఈ పాట. ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. మొత్తానికి మెగాస్టార్ పాట హిందీలో కూడా వినిపిస్తే ఆ కిక్కే వేరప్పా అంటున్నారు అభిమానులు.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>