Akshay Kumar - Selfiee Movie Trailer Talk : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. గతేడాది అక్కీ.. ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్‌పుత్లీ, రామ్ సేతు సినిమాలతో పలకరించారు. ఇందులో రామ్ సేతు సినిమా మాత్రమే ఓ మోస్తరు విజయం మాత్రమే సాధించింది. ఈ యేడాది చివర్లలో ‘ఆన్ యాక్షన్ హీరో’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అంతేకాదు తొలిసారి తన సినీ జీవితంలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాలో చారిత్రక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయింది. ఆసంగతి పక్కనే పెడితే.. రీసెంట్‌గా అక్షయ్ కుమార్.. భారతీయుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ కోవలో అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ మూవీతో ఈ యేడాది పలకరించనున్నారు. ఈ సినిమాలో ఎమ్రాన్ హష్మీ మరో ముఖ్యపాత్రలో నటించారు. అక్షయ్ కుమార్‌తో ‘గుడ్ న్యూస్’ సినిమాను తెరకెక్కించిన రాజ్ మెహతా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో అక్షయ్ కుమార్ ‘విజయ్’ అనే హీరో పాత్రలో నటించారు. అతని అభిమాని పాత్రలో ఎమ్రాన్ హష్మీ నటించారు.
AKSHAY KUMAR VS EMRAAN HASHMI… SUPERSTAR VS FAN: 'SELFIEE' TRAILER IS HERE.. Trailer of #Selfiee - starring #AkshayKumar and #EmraanHashmi - arrives… Directed by #RajMehta… In *cinemas* 24 Feb 2023… #SelfieeTrailer: https://t.co/0aZl8Et4sl
— taran adarsh (@taran_adarsh) January 22, 2023
‘సెల్ఫీ’ మూవీ మలయాళంలో హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ట్రైలర్ విషయానికొస్తే.. ఈ సినిమాను ఒక హీరోతో ఒక ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఓ సెల్పీ ఫోటో దిగాలనుకుంటారు. ఈ సందర్భంగా మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎలాంటి ప్రాబ్టెమ్స్ ఫేస్ చేసారనేది ఈ సినిమా స్టోరీ. మొత్తంగా ఒక హీరో, వెహికల్ ఇన్‌స్పెక్టర్ అహం నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
మొత్తంగా సూర్యవంశీ తర్వాత సరైన సక్సెస్‌లేని అక్షయ్ కుమార్.. సెల్పీ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో అక్షయ్ కుమార్.. షౌకీన్స్ సినిమాలో హీరో పాత్రలో నటించారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తన నిజ జీవిత పాత్ర యైన ఒక సినిమా కథానాయకుడు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫిబ్రవరిన విడుదల చేస్తున్నారు. మరి ‘సెల్పీ’ మూవీతో ఎమ్రాన్ హష్మీ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood news, Emraan Hashmi, Selfiee Movie