• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AKSHAY KUMAR DONATES ONE AND HALF CRORE TO BUILD HOME FOR TRANSGENDER PEOPLE IN CHENNAI

బాలీవుడ్ స్టార్ హీరో పెద్ద మనస్సు...ట్రాన్స్‌జెండర్ల కోసం కోటిన్నర విరాళం

బాలీవుడ్ స్టార్ హీరో పెద్ద మనస్సు...ట్రాన్స్‌జెండర్ల కోసం కోటిన్నర విరాళం

ట్రాన్స్ జెండర్ల కోసం కోటిన్నర రూపాయల చెక్కును అందజేసిన అక్షయ్ కుమార్

సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్...ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక గృహ నిర్మాణం చేపడుతున్నారు.

  • Share this:
    బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన పెద్ద మనస్సును మరోసారి చాటుకున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఈ బాలీవుడ్ స్టార్ హీరో...ట్రాన్స్ జెండర్ల కోసం కోటిన్నర రూపాయల విరాళం ఇచ్చాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తన ట్రస్ట్(లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్) ద్వారా ట్రాన్స్‌జెండర్ల కోసం చెన్నైలో  గృహ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ట్రస్ట్ తరఫున భూమిని సమకూర్చగా...గృహ నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణం కోసం కోటిన్నర సాయాన్ని అందించాడు అక్షయ్ కుమార్. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్ల సమక్షంలో లారెన్స్‌కు అజయ్ కుమార్ ఈ చెక్కును అందజేశారు.

    Akshay Kumar, raghava lawrence, lawrence charitable trust, lakshmi bomb, transgenders, house for transgenders, లక్ష్మీ బాంబు, ట్రాన్స్‌జెండర్స్, అక్షయ్ కుమార్, చెన్నై, రాఘవ లారెన్స్
    ట్రాన్స్ జెండర్ల కోసం కోటిన్నర రూపాయల చెక్కును అందజేసిన అక్షయ్ కుమార్


    ఈ విషయాన్ని లారెన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గృహ నిర్మాణం కొరకు ఓ హీరో​ ఇంత భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి అంటూ లారెన్స్ ప్రశంసల జల్లుకురిపించారు. రాఘవ లారెన్స్‌ దర్మకత్వంలో తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో అక్షయ్‌ నటిస్తున్నారు.
    Published by:Janardhan V
    First published: