HOME »NEWS »MOVIE »akshay kumar donates for construction of ram temple in ayodhya asks to contribute fans ta

Akshay Kumar: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సినీ రంగం నుంచి తొలి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్..

Akshay Kumar: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సినీ రంగం నుంచి తొలి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్(ఫైల్ పొటో)

Akshay Kumar: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణను ప్రారంభించేందుకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ సన్నాహాలు మొదలుపెట్టింది.అందులో భాగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భారతీయ సినీ రంగం నుంచి తొలి విరాళం ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు అక్షయ్ కుమార్.

  • Share this:
    Akshay Kumar: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణను ప్రారంభించేందుకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు 22 రోజులు పాటు కంటిన్యూగా దేశంలోని మారుమూల గ్రామంలోని  ప్రతి గడపకు వెళ్లి విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు. ఇప్పటికే  వ్యక్తిగతంగా ప్రముఖులను కలిసి విరాళాలు సేకరించే ప్రక్రియను ట్రస్ట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రస్ట్‌ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి మొదటి విరాళం స్వీకరించారు. తనను కలిసిన ట్రస్ట్‌ ప్రతినిధుల బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ. 5,00,100 చెక్కును అందజేశారు. రాష్ట్రపతితో పాటు ఈ బృందం ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతిని కలిసి విరాళాల సేకరించనున్నారు. నిధుల సేకరణ నేడు ప్రారంభమై.. వచ్చే నెల 27వ తేదీ వరకు సాగనుంది. నిధుల సేకరణ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో కమిటీలను ఏర్పాటు చేశారు.

    ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్య ప్రదేశ్ సీఎం కూడా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు విరాళాలు అందించారు. తాజాగా బాలీవుడ్ నుంచి రామ జన్మభూమికి అక్షయ్ కుమార్  తొలి విరాళం ప్రకటించారు.




    అంతేకాదు రామసేతు నిర్మాణంలో వానరులకు సాయం పడిన ఉడతలా అయోధ్యలో నిర్మించే రామ జన్మభూమికి విరాళం అందించే భాగ్యం కలగడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు అక్షయ్. ఈ పవిత్ర కార్యంలో తన అభిమానులతో పాటు సామాన్యులు పాల్గొని పెద్ద ఎత్తున రామ జన్మభూమికి విరాళాలు అందించాలని కోరారు. ఐతే.. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ఎంత మొత్తంలో విరాళం ఇస్తుందనేది మాత్రం ప్రకటించలేదు.  మొత్తంగా కరోనా సమయంలో కూడా అక్షయ్ కుమార్ ఏ హీరో ఇవ్వనంత.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 35 కోట్ల వరకు విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తాజాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భారతీయ సినీ రంగం నుంచి తొలి విరాళం ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు అక్షయ్ కుమార్.

    అక్షయ్ కుమార్.. ప్రస్తుతం ‘బచ్చన్ పాండే’ షూటింగ్‌తోపాటు..  భారతీయ చారిత్రక యోధుడు ‘పృథ్వీరాజ్ చౌహాన్’ జీవిత చరిత్రపై ‘పృథ్వీరాజ్’ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు రామ్ సేతు అనే సినిమా చేస్తున్నాడు. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 18, 2021, 14:06 IST