Akshay.. తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్..

kesari | బాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 16, 2019, 12:05 PM IST
Akshay.. తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్
  • Share this:
బాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. అంతేకాదు తను సంపాదించే దాంట్లో సైనికులకు, రైతులకు తనకు తోచిన సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇదంత అక్షయ్ కుమార్ తన రాజకీయాల్లో ప్రవేశించడానికే చేస్తున్నాడనే రూమర్స్ కూడా వినిపించాయి. అంతేకాదు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరుపున ఢిల్లిలోని చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి అక్షయ్ పోటీ చేయనున్నాడనే వార్తలు సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై అక్షయ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాలు ద్వారా రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. అంతేకానీ పాలిటిక్స్ లో పోటీ చేసేందుకు సిద్దంగా లేనని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు తాను సినిమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యాను. ఇప్పటి వరకు రాజకీయా ఏజెంట్‌గా లేను. నేను సినిమాల ద్వారా ఏదైతే చేస్తున్నానో రాజకీయాల్లో అది నేనప్పటికీ చేయలేను. నేను ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’లో నటించాను. దాని కారణంగా దేశంలో చాలా మార్పు వచ్చింది.

అదే విధంగా ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిపుడే కొన్ని మార్పులు వస్తున్నాయి. కొన్నేళ్లుగా వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న అక్షయ్ కుమార్ ఇపుడు చరిత్రలో నిలిచిపోయిన సారాగర్హి యుద్ద నేపథ్యంలో ‘కేసరి’ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 21 ఈసినిమాలో అక్షయ్ కుమార్ హవల్దార్ ఇషాన్ సింగ్ పాత్రలో నటించాడు.

 

First published: March 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు