Akshay Kumar: బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్ కుమార్ షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఈయన ‘బడేమియా ఛోటేమియా’ సినిమా చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్కాట్లాండ్‌లో జరుగుతోంది. అక్కడ షూటింగ్‌లో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్స్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. అయితే హెలికాప్టర్ పై అక్షయ్ చేస్తోన్న స్టంట్స్‌లో భాగంగా ఈయన గాయపడ్డట్టు తెలుస్తోంది. అయితే.. డాక్టర్లు అక్షయ్‌ను పరీక్షించి కొన్ని రోజులు ఎలాంటి స్టంట్స్ చేయకుండా దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో అక్షయ్.. మోకాలి గాయం తర్వాత మిగతా షూటింగ్ కంప్లీటైన తర్వాత యాక్షన్ సీన్స్ చేసే అవకాశాలున్నాయి. లేకపోతే డూప్‌తో ఆ సీన్స్ తీస్తారా అనేది చూడాలి. అక్షయ్ విషయానికొస్తే.. బాలీవుడ్ చిత్రసీమలో విరామం,విసుగు లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరో ఎవరంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు అక్షయ్ కుమార్‌దే.
లాస్ట్ ఇయర్ ఐదు సినిమాలతో బాక్సాఫీస్‌ను పలకరించిన ఈయన.. తాజాగా ‘సెల్పీ’ మూవీతో పలకరించారు. ఈ చిత్రం మలయాళ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీకి రీమేక్. ఆల్రెడీ ఈ సినిమాను యూట్యూబ్‌తో పాటు ఓటీటీల్లో చాలా మంది సబ్ టైటిల్స్‌తో చూసేసి ఉండటంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరైన వసూళ్లు దక్కించుకోలేకపోయింది.
get well soon ???? #AkshayKumar Paji pahle aap theek ho jao baad Mein shooting . all the best best of luck speedy recovery ???????? @akshaykumar
GET WELL SOON AKSHAY KUMAR pic.twitter.com/X5zln9VzeB — Sukanta Khiladi 2.o ???? (@Sukanta73182703) March 24, 2023
అక్షయ్ కుమార్.. భారతీయుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటిస్తున్నారు.దాంతో పాటు ‘హేరా ఫేరా 3’ సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్షయ్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హేరా ఫేరీ’ సినిమా బాలీవుడ్‌లో ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అప్పటి వరకు అక్షయ్ కుమార్ అంటే యాక్షన్ అనే ఇమేజ్ ఉండేది. ఈ సినిమాతో ఖిలాడీ ఇమేజ్ కాస్తా కామెడీ హీరోగా టర్న్ అయింది. ఈ సినిమాను హిందీలో ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు. 31 మార్చి 2000లో ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా మలయాళంలో సిద్ధిక్ లాల్ డైరెక్ట్ చేసిన ‘రామ్‌జీ రావు స్పీకింగ్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఆ తర్వాత 2006లో ‘ఫిర్ హేరా ఫేరీ’ సినిమా నీరజ్ వోరా దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి పార్ట్‌లో అక్షయ్ కుమార్ ‘రాజు’ అనే పాత్రలో నటించారు. సునీల్ శెట్టి ‘ఘన్‌శ్యామ్’ పాత్రలో నటించారు. అటు పరేష్ రావల్ బాబురావు గణపత్ రావు ఆప్టేగా నటించారు. ఈ సినిమాలో వీళ్ల నటనను ఎవరు మరిచిపోలేరు.
ఇక ఈ మూడో సీక్వెల్‌కు ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియాద్‌వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబాయిలో ఓ స్టూడియోలో ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే యేడాది ఈ సినిమా పట్టాలెక్కనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood news