Akshay: మరోసారి సింప్లిసిటీ చాటిన అక్షయ్ కుమార్.. ఇంతకీ ఏం చేసాడంటే..

Akshay Kumar | బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నాడు. తాజాగా అక్కీ ముంబాయిలోని..

news18-telugu
Updated: September 19, 2019, 10:28 AM IST
Akshay: మరోసారి సింప్లిసిటీ చాటిన అక్షయ్ కుమార్.. ఇంతకీ ఏం చేసాడంటే..
అక్షయ్ కుమార్ (Twitter/Photo)
news18-telugu
Updated: September 19, 2019, 10:28 AM IST
Akshay Kumar: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నాడు. తాజాగా అక్కీ ముంబాయిలోని ఘాటాకోపర్‌లో జరుగుతున్న‘గుడ్‌న్యూస్’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అక్కడి నుండి వెర్సోవా వెళ్లాల్సి వచ్చింది. ఇందుకోసం గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ చెక్ చేస్తే.. అతడున్న ప్లేస్ నుంచి అక్కడికి చేరుకునేందుకు 2 గంటల సమయం చూపించింది. దాంతో ఈ సినిమా డైరెక్టర్ అక్షయ్‌కు ముంబాయి మెట్రోలో ప్రయాణించమని సలహా ఇచ్చాడు. ఐతే.. మెట్రోలో వెళ్లడానికి మొదట సంశయించిన అక్కీ ఆ తర్వాత మెట్రో వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అక్షయ్ ఇద్దరు బాడీ గార్డుల సాయంతో మెట్రో ఎక్కి ఓ మూలన కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రజలెవరు ఆయన్ని అంతగా గమనించలేదు. ఆ సమయంలో ముంబాయిలో వర్షం పడుతోంది. ఆ వర్షంలో మెట్రో ప్రయాణిస్తూ అక్షయ్ కుమార్ ఎంతగానో ఎంజాయ్ చేసాడు.


తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమా విజయం సాధించింది. దీంతో అక్కీ నటించిన హౌస్‌ఫుల్ 4 త్వరలో విడుదల కానుంది. దీంతో పాటు అక్షయ్ కుమార్ చేతిలో అర డజను పైగా సినిమాలున్నాయి.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...