Home /News /movies /

AKSHAY KUMAR BACHCHAN PANDEY RELEASE DATE OFFICIALLY ANNOUNCED HERE ARE THE DETAILS TA

Akshay Kumar - Bachchan Pandey : అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ రిలీజ్ డేట్ ప్రకటన.. కరోనా వేవ్‌లో కూడా తగ్గని ఖిలాడి జోరు..

అక్షయ్ ‘బచ్చన్ పాండే’ విడుదల తేది ప్రకటన (Twitter/Photo)

అక్షయ్ ‘బచ్చన్ పాండే’ విడుదల తేది ప్రకటన (Twitter/Photo)

Akshay Kumar - Bachchan Pandey : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాాలతో అదరగొడుతున్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘బచ్చన్ పాండే’ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.

  Akshay Kumar - Bachchan Pandey : బాలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీ హీరోలు కరోనా కారణంగా తమ సినిమాలను ఎపుడు రిలీజ్ చేయాలి. ఒకవేళ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమా చూస్తారా లేదా అనుమానులు వ్యక్తం చేస్తున్న సమయంలో నేనున్నాను అంటూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాాలతో అదరగొడుతున్నారు. గతేడాది  కరోనా సెకండ్ వేవ్ తర్వాత ‘బెల్ బాటమ్’ సినిమాతో థియేటర్స్‌లో పలకరించారు. పాజిటివ్ టాక్‌తో విడుదలైన ‘బెల్ బాటమ్’  ముంబై సహా పలు ప్రాంతాల్లో థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కానీ సందర్భంలో విడుదలైన ఈ సినిమా కేవలం రూ. 30 కోట్ల వసూళ్లనే సాధించింది. ఆ తర్వాత  దీపావళి సందర్భంగా విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు అక్షయ్ కుమార్.

  ఈ సినిమా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇప్పటికే  రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ‘ఆర్ఆర్ఆర్’ సహా పలు సినిమాల హీరోలు, దర్శకులు తమ సినిమాలను భేషుగ్గా విడుదల చేసుకోవచ్చనే సందేశం ఇచ్చింది.  ‘సూర్యవంశీ’ సినిమా కేవలం ఓవర్సీస్‌లో రూ. 50 కోట్ల వరకు రాబట్టి మిగతా సినీ నిర్మాతలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆ తర్వాత ఈయన ముఖ్యపాత్రలో నటించిన ‘అతరంగీ రే’ మాత్రం డిస్నీ హాట్ స్టార్‌లో గతేడాది చివరల్లో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సారా అలీ ఖాన్ కథానాయినగా నటించగా.. ధనుశ్ మరో హీరోగా యాక్ట్ చేసారు.

  బాలీవుడ్‌లో వరుస సినిమాలో అక్షయ్ కుమార్ రచ్చ (Twitter/Photo)


  ఈ సినిమా తర్వాత అక్షయ్ కుమార్.. హిందూస్థాన్ సింహంగా పేరు గాంచిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథపై ‘పృథ్వీరాజ్’ టైటిల్‌తో చారిత్రక సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా.  యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేసారు. ముందుగా ఈ  సినిమాను జనవరి 21న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన ఓమైక్రాన్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.

  Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఓటీటీ స్ట్రీమింగ్ పై అదిరిపోయే అప్‌డేట్..

  ‘హిందూస్థాన్ సింహం వస్తోంది’. సలామ్ చేయడానికీ రెడీగా ఉండండి అంటూ టీజర్ ఓ రేంజ్‌లో ఉంది. ధర్మం కోసం బతికాను. ధర్మం కోసం చావనైనా చస్తాను అంటూ పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగులు బాగున్నాయి.  హిందూ ధర్మ స్థాపన కోసం పృథ్వీరాజ్ చేసిన పోరాటం ఈ సినిమాలో హైలెట్‌గా నిలువనున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో సంజయ్ దత్, సోనూసూద్ నటించారు. మరోవైపు  ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడిగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కథానాయికగా ఈ సినిమాతో పరిచయమవుతోంది. ఈ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో నటించింది.

  Balakrishna - Ramesh Babu : ఎన్టీఆర్, కృష్ణ మధ్యే కాదు.. బాలకృష్ణ, రమేష్ బాబు మధ్య నడిచిన ఈ రచ్చ గురించి తెలుసా..

  ఆ సంగతి పక్కన పెడితే.. ఆ సినిమాతో పాటు ఎపుడో అనౌన్స్ చేసిన ‘బచ్చన్ పాండే’ సినిమాను అంతా బాగుంటే.. ఈ నెల 22న విడుదల కావాలి.   ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరోసారి గ్యాంగ్ స్టర్ బచ్చన్ పాండే పాత్రలో నటిస్తున్నాడు. నిర్మాత సాజిత్ నడియావాలాతో హీరో అక్షయ్ కుమార్ కు ఇది 10వ సినిమా.

  బచ్చన్ పాండే‌గా అక్షయ్ కుమార్ (Twitter/Photo)


  ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో అక్షయ్ సరసన కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా కరోనాతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి సందర్భంలో అక్షయ్ కుమార్.. తన సినిమాల విడుదల చేస్తూ మిగతా హీరోలకు జోష్ తీసుకొస్తున్నారు.

  బచ్చన్ పాండే‌గా అక్షయ్ కుమార్ (Twitter/Photo)


  మరోవైపు అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ సేతు’ నిజమా.. ? కల్పనా ? అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను తమిళనాడులోని ‘రామ్ సేతు’ నేపథ్యంలో చారిత్రక నేపథ్యంలో  తెరకెక్కిస్తున్నారు. కోట్లాది భారతీయుల గుండె చప్పుడైన ‘రామ్ సేతు’ పై నిర్మిస్తోన్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. దాంతో పాటు ‘రక్షా బంధన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉంది.

  Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్‌ స్పెషల్‌ ఎపిసోడ్.. ఈ సారి రచ్చ ఓ రేంజ్‌లో..

  రీసెంట్‌గా ‘ఓ మై గాడ్ 2’  సినిమాఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మహా కాళేశ్వరుడి పాత్రలో కనిపించనున్నారు. దాంతో పాటు 1971 యుద్ద నేపథ్యంలో ‘గూర్క’ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. గూర్కా రెజిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్కీ గూర్కా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.దీంతో పాటు ‘ఆకాశం నీ హద్దురా’, ‘రాక్షసుడు’, ఊసరవెల్లి’, డ్రైవింగ్ లైసెన్స్ వంటి రీమేక్స్‌లో నటించడానికి అక్షయ్ కుమార్ ఓకే చెప్పినట్టు సమాచారం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akshay Kumar, Bachchan Pandey, Bollywood news, Sooryavanshi Movie

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు